ప్రారంభమైన గద్దర్ అంతిమయాత్ర.. భారీగా వచ్చిన అభిమానులు

నవతెలంగాణ- హైదరాబాద్‌: ప్రజాగాయకుడు గద్దర్‌  అంతిమయాత్ర ప్రారంభమైంది. ఎల్బీ స్టేడియం నుంచి గన్‌పార్క్‌, అమరవీరుల స్థూపం, అంబేద్కర్‌ విగ్రహం మీదుగా అల్వాల్‌లోని ఆయన నివాసానికి అంతిమ యాత్ర కొనసాగనుంది. గద్దర్‌ పార్ధివదేహాన్ని అల్వాల్‌లోని ఆయన నివాసం వద్ద కొద్దిసమయం ఉంచిన తర్వాత.. ఆయన స్థాపించిన మహాబోధి విద్యాలయం ఆవరణలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంతిమ యాత్రలో భాగంగా గన్‌పార్క్‌, అంబేద్కర్‌ విగ్రహం వద్ద కొద్దిసేపు నిలపివేయనున్నారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కళాకారులు, ప్రజలు భారీ సంఖ్యలో ఎల్బీ స్టేడియం వద్దకు తరలివచ్చారు.
ప్రముఖలు ఘన నివాళి
ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ పార్థివ దేహానికి టీపీసీ రేవంత్‌ రెడ్డి, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మాజీ మండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు నివాళులు అర్పించారు.
– 74 ఏళ్ల వయసులో కూడా గోసీ గొంగడితో సమాజాన్ని మేల్కొలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా: స్పీకర్‌ పోచారం

– నటుడు మోహన్ బాబు, బండ్ల గణేష్‌, మంచు మనోజ్‌, సింగర్‌ మధు ప్రియ గద్దర్‌కు నివాళులు అర్పించారు.

– గద్దర్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు.

Spread the love