Saturday, July 25, 2026
E-PAPER
Homeజాతీయంఇ ఇథనాల్ ముసుగులో 
గడ్కరీ ఫ్యామిలీ దందా

ఇ ఇథనాల్ ముసుగులో 
గడ్కరీ ఫ్యామిలీ దందా

- Advertisement -

కేంద్ర మంత్రిపై ‘పరస్పర విరుద్ధ 
ప్రయోజనాలంటూ’ విమర్శలు
స్వల్పవాటానే: కేంద్ర మంత్రి గడ్కరీ
న్యూఢిల్లీ : దేశంలో పర్యావరణహిత ఇంధన విప్లవమంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న ఈ20 ఇథనాల్ మిశ్రమ విధానం పెద్ద ఎత్తున వివాదాస్పదమవుతోంది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే నిర్ణయం వెనుక దేశ ప్రయోజనాల కంటే.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ వ్యాపార సామ్రాజ్య విస్తరణే ప్రధాన ఉద్దేశమనే తీవ్ర ఆరోపణలు వస్తోన్నాయి. స్వచ్ఛ ఇంధనం పేరిట అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా గడ్కరీ కుమారులకు చెందిన కంపెనీలు రాత్రికి రాత్రే అసాధారణ ఆర్థిక వృద్ధిని సాధించడమే ఇందుకు నిదర్శనమంటూ రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది పరస్పర విరుద్ధ ప్రయోజనాలు (కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ) కోసం అనే ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు.

వినియోగదారులపై తీవ్ర ప్రభావం..
ప్రభుత్వ ఈ విధానం సాధారణ వాహనదారుల మెడకు చుట్టుకుంటోంది. దేశంలో జులై 2025 నాటికి సగటున 19 శాతం ఇథనాల్ బ్లెండింగ్‌ను సాధించినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీనివల్ల పాత వాహనదారుల ఎంపిక హక్కు పూర్తిగా హరింపబడుతోంది. 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ20 సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం, అంతకుముందు రోడ్డెక్కిన 80 శాతానికి పైగా వాహనాల పరిస్థితిని పూర్తిగా గాలికొదిలేసింది. పెట్రో బంకుల్లో ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా సాధారణ పెట్రోల్‌ను నిలిపివేసి బలవంతంగా ఈ20ని రుద్దుతుండటంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మైలేజీ పడిపోవడంపై ఆందోళనలు
ఈ20 ఇంధనాన్ని పాత వాహనాల్లో వినియోగిస్తే ఇంధన వ్యవస్థలోని రబ్బరు గొట్టాలు, సీల్స్, గ్యాస్కెట్లు వంటి సున్నితమైన ఇంజిన్ భాగాలు త్వరగా దెబ్బతినే ప్రమాదముందని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్‌ఎఐ) అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అదే విధంగా పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో దాదాపు 30 శాతం తక్కువ శక్తి ఉండటంతో మైలేజీ భారీగా పడిపోతోందని, ఫలితంగా వాహనదారులకు మరమ్మతు ఖర్చులు తడిసి మోపేడులా మారుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. హైవేలపై అధిక వేగంతో వెళ్లేటప్పుడు మైలేజీ తగ్గే అవకాశం ఉందని స్వయంగా మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించినప్పటికీ.. నగరాల్లో పెద్దగా తేడా ఉండదని బుకాయించడంపై విమర్శకులు మండిపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ, రైతుల సంక్షేమం, ఇంధన భద్రత కోసమే ఈ విధానాన్ని తీసుకొచ్చామని మంత్రి గడ్కరీ సమర్థించుకుం టున్నప్పటికీ.. విధాన రూపకర్త స్థానంలో ఉంటూ సొంత కుటుంబ వ్యాపారానికి లబ్ధి చేకూరుస్తున్నారనే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేకపోవడం గమనార్హం.

స్వల్పవాటానే..
ఇథనాల్ మిశ్రమ ఇంధన (ఈ20) విధానంపై వస్తున్న విమర్శలను కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. తన కుమారుల వ్యాపారంలో ఇథనాల్‌కు సంబంధించిన వాటా చాలా స్వల్పమని అన్నారు. దీని వల్ల తమ కుటుంబం ప్రయోజనం పొందిందనే ఆరోపణలు నిరాధా రమన్నారు. ఈ 20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్‌లకు ఎలాంటి నష్టం జరగదని పేర్కొ న్నారు. ఇథనాల్ మిశ్రమం వల్ల మైలేజీ తగ్గుదల ఉంటే అది కూడా చాలా స్వల్పమని, అధిక వేగంతో నడిపే సమయంలో మాత్రమే కొద్దిపాటి ప్రభావం కనిపిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. వాహనాల కాలుష్యాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు.

రాత్రికి రాత్రే కోట్లు..

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడు నిఖిల్ గడ్కరీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ ఫిబ్రవరి 2024లో ఇథనాల్ ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టింది. దేశంలో ఇథనాల్ బ్లెండింగ్‌ను కేంద్ర ప్రభుత్వం బలంగా ప్రోత్సహిస్తుండటంతో నితిన్ గడ్కరీ అండదండలతో ఈ కంపెనీ ఊహించని సరికొత్త శిఖరాలను తాకింది. ఫలితంగా సియాన్ కంపెనీ ఆదాయాలు రాత్రికి రాత్రే 28 రెట్లు ఎగిశాయి. లాభాలు ఏకంగా 100 రెట్లు ఎగబాకాయి. గతంలో రూ. 41 కోట్లుగా ఉన్న ఏకీకృత ఆదాయం ఏకంగా రూ. 1,522 కోట్లకు, రూ.4.9 కోట్లుగా ఉన్న లాభాలు రూ. 93 కోట్లకు చేరుకున్నాయి. దీనివల్ల కంపెనీ స్టాక్ ధర రూ. 41 నుంచి రూ. 668కి దూసుకెళ్లడంతో మార్కెట్ క్యాప్ రూ. 2,061 కోట్లకు చేరడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -