టమోటాతో నిగారింపు

ఎండలకు కొంచెం సేపు బయటకు వెళ్ళి వచ్చినా చర్మం నిగారింపు కోల్పోతుంది. ఎండ తగలకుండా ముఖాన్ని ఎంత కవర్‌ చేసినా సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అందుకే చర్మాన్ని కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న పని. చర్మాన్ని మెరిసేలా చేయడమే కాదు, ఆరోగ్యంగానూ ఉంచుకోవాలి. ఇందుకు క్రీములు లోషన్లు వంటి వాటిని ఉపయోగించడం కంటే కొన్ని రకాల సహజ పద్ధతుల్ని ఉపయోగించి కాంతిలీనేలా చేసుకోవచ్చు. ఇందుకు టమోటాలు ఉపయోగపడతాయి.
– టమోటాలో 16 శాతం విటమిన్‌ ఎ ఉండటం వల్ల సరిగ్గా ఉపయోగిస్తే ఎంతటి కఠినమైన చర్మాన్నైనా మృధువుగా మారుస్తుంది. అంతేకాదు, వయస్సు వల్ల ముఖంపై ఏర్పడే మచ్చలను సైతం తగ్గించడానికి సహాయపడుతుంది.
– ఇందులో ఉండే విటమిన్‌ సి చర్మంలో కొల్లాజెన్‌ స్థాయిలను 22 శాతానికి పైగా పెంచుతుంది.
– 5 శాతం కంటే ఎక్కువ బి6 విటమిన్‌ ఉంటుంది. ఇది దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్‌ చేయడంతో పాటు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షించేందుకు ఒక రక్షిత పొరను ఏర్పరుస్తుంది.
– టమోటాల్లో అధిక మొత్తంలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్‌ కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై పొరను ఏర్పరచి, తేమగా ఉంచుతాయి.

Spread the love