లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం : అదనవు కలెక్టర్ బి.ఎస్. లత.

– చట్టంపై అవగాహనా సదస్సు. 
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్.
గర్భస్థ లింగ నిర్ధారణ నేరమని అదనపు కలెక్టర్ బి.ఎస్. లత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం  కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 100 రోజులు స్పెషల్ అవేర్నస్ క్యాంపైన్ లో భాగంగా నేడు పి సి పి ఎన్ డి టి అలాగే  ఎంటిపి చట్టంపై అవగాహనా కార్యక్రమం జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ  ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ  గర్భస్థ లింగ నిర్దారణ పరీక్షలు చేయడం నేరమని అన్నారు. గర్భిణులకు స్కానింగ్ అనేది బిడ్డ ఎదుగుదల తెలుసుకోడానికే తప్ప కడుపులో బిడ్డ జెండర్ తెలిపేందుకు కాదని అలా తెలుసుకొని ఆడపిల్ల అని తెలిస్తే గర్భంలోనే ఆడపిల్లని చంపేయడం నేరమని అన్నారు.
ఈ సృష్టి ఏర్పాటులో మహిళా యొక్క ప్రాముఖ్యత తెలియచేస్తూ నేటి సమాజంలో మహిళల ప్రాధాన్యత గురుంచి వివరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అంగన్వాడీ,  మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మెడికల్ ఆఫీసర్స్ ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు పి సి ఎన్ డి టి, ఎం టిపి చట్టం యొక్క తీవ్రత గ్రామాలలో అందరికి తెలియచేసేలా అవగాహన కార్యక్రమాలు, చర్యలు తీసుకోవాలని తెలియచేశారు.  ఈ కార్యక్రమంలో డా: జయ  ప్రోగ్రాం ఆఫీసర్, అంజయ్య  మీడియా ఆఫీసర్ లు రిసార్స్ పర్సన్స్ గా పి సి పి ఎన్ డి టి, ఎం టి పి చట్టాల గురించి తెలియజేసారు  ఈ కార్యక్రమం లో  మెడికల్ ఆఫీసర్ లు, ఏఎన్ఎం లు,సఖి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు మరియు సంకల్ప – మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love