విద్యుత్‌ సమస్యలపై దద్దరిల్లిన సర్వసభ్య సమావేశం

– ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిలిపివేయాలి
– ప్రాణాలు పోతున్న పట్టించుకోని విద్యుత్‌ అధికారులు
– ఆధార్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలి
– అమలుకు నోచుకోని తీర్మానాలు
– మధ్యాహ్న 12 గంటలైనా హాజరుకాని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-మర్పల్లి
మండల పరిషత్‌ కార్యాలయంలో వైస్‌ ఎంపీపీ మో హన్‌ రెడ్డి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికా రులు తమ ఏజెండాలను చదివి వినిపించారు. పట్లుర్‌, మర్పల్లిలో గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదని వాటిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ దష్టికి తీసుకువచ్చారు మర్పల్లి ఎంపీడీఓ కాంప్లెక్స్‌ షేటర్లలో అవకతవకలు జరిగా యని వాటిపై దర్యాప్తు జరపాలని సభ్యులు ఆగ్రహం వ్య క్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొన సాగుతుందని ఇచ్చిన హామీలు నెరవేర్చ లేకపోతున్నామని బుచన పల్లి ఎంపీటీసీ బాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ బాల్‌రెడ్డి ఆరోపణలు సరికాదు ప్రభుత్వం ఎంపీ టీసీలకు నిధులు ఇస్తుందని చెప్పడంతో ఇద్దరి మధ్యన వాగ్వాదం జరిగింది .సమావేశంలో మీరు గౌరవ సభ్యులు మాత్రమే గౌరవంగా ఉండి అధికారులతో సమాధానం చెప్పించాలి అని బాల్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ పై ర్లు లూజ్‌ గా ఉన్నాయని విద్యుత్‌ మరణాలు మండలంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయని వెంటనే విద్యుత్‌ సమస్యలను తొలగించాలని, పట్లూర్‌ లో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు వెంటనే నిర్మించాలని సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్రతిదానికి ప్రభుత్వం ఆధార్‌ లింక్‌ చేయడంతో ఆధార్‌ సెంటర్‌ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని వెంటనే మండల కేంద్రంలో ఆధార్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు యూరియా సరిపోవడం లేదని అధికారులు యూరి యాను ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని కొందరు ఆరోపిం చారు. గతంలో మర్పల్లి మండలం నుండి మోమిన్‌ పెట్‌ మండలానికి తరలించిన ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే మర్పల్లి మండలానికి తిరిగి రప్పించాలని సర్వసభ్య సమావేశాల్లో పలుమార్లు తీర్మానాలు చేసిన ఫలితం లేకుండా పోయిందని కార్యాలయాలు తరలిపో వడం నేటికీ కొనసాగుతూనే ఉందని వారం రోజుల క్రితం ఇంజనీరింగ్‌ ఆఫీస్‌ తాండూర్‌ నియోజకవర్గానికి తరలిం చడం ఎంత వరకు సమంజసం అని పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన సర్వసభ్య సమావేశం 12:30 గంటలు అయినా అధికారులు ప్రజా ప్రతినిధులు సమావేశానికి రాకపోవడం గమనార్హం. అధికారులు సమావేశం వాయిదా పడుతుందేమో అని అప్రమత్తమై వెంటనే సమావేశాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసి మధుకర్‌, తహసీల్దార్‌ గణేష్‌, ఎంపీవో మహేశ్‌ కుమార్‌, సీనియర్‌ సహాయకులు కష్ణరావు, కో అప్షన్‌ సభ్యుడు సోహెల్‌, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు

Spread the love