గర్భవతిని చేసి.. పెళ్లికి నిరాకరించి !

– ఆత్మహత్య యత్నం చేసిన యువతి
– ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
నవతెలంగాణ – రాయపర్తి
ప్రేమిస్తున్న… పెళ్లి చేసుకుంటా అని నమ్మబలికినా యువకుడు నమ్మించి గర్భవతిని చేసి  మొఖం చాటేయడంతో యువతి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.. విశ్వసనీయ సమాచారం మేరకు మండల కేంద్రానికి చెందిన జక్కుల నరేష్ అనే యువకుడు గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్న, పెళ్లి చేసుస్పకుంటా అని వెంటపడుతున్నాడు. మాటలను నమ్మిన యువతి అతనికి దగ్గర అయింది. ఇదే అదునుగా భావించిన యువకుడు యువతిని లోపరుచుకొని గర్భవతిని చేశాడు. చివరికి యువతని పెళ్లి చేసుకోనని చెప్పడంతో యువతి పురుగుల మందు త్రాగింది దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. యువతి పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు అని సమాచారం.
Spread the love