తన బ్యాటింగ్ తో విమర్శకుల నోరు మాయించాడు: గిల్‌క్రిస్ట్

నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్-8లో ఆస్ట్రేలియాపై విధ్వంసకర ఇన్నింగ్సుతో రోహిత్ చాలామంది నోర్లు మూయించాడని ఆసీస్ మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. ఐపీఎల్, లీగ్ దశలో హిట్ మ్యాన్ ప్రదర్శనపై వచ్చిన విమర్శలకు అతని బ్యాటింగ్ సమాధానంగా నిలిచిందన్నారు. కెప్టెన్ ముందుండి ఇలాంటి ప్రదర్శన చేస్తే మిగతా ఆటగాళ్లు స్ఫూర్తి పొందుతారని చెప్పారు. ఈ మ్యాచులో కంగారులను చిత్తు చేసి టీమ్ ఇండియా సెమీస్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

Spread the love