దినేశ్ కార్తీక్‌ను స్లెడ్జ్‌ చేసిన రోహిత్ శ‌ర్మ‌..

నవతెలంబ – వాంఖ‌డే: ఆర్సీబీతో గురువారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్లెడ్జింగ్‌కు పాల్ప‌డ్డాడు. ఆర్సీబీ బ్యాట‌ర్ దినేశ్ కార్తీక్‌పై వ‌ర‌ల్డ్‌క‌ప్ కామెంట్ చేశారు. దానికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. రోహిత్ చేసిన కామెంట్ స్టంప్ మైక్‌కు చిక్కింది. దినేశ్ కార్తీక్ నిన్న‌టి మ్యాచ్‌లో ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. అత‌ను కేవ‌లం 23 బంతుల్లో 53 ర‌న్స్ చేశాడు. దాంట్లో అయిదు ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. దూకుడుమీదున్న దినేశ్‌ను అడ్డుకునేందుకు రోహిత్ త‌న‌దైన స్ట‌యిల్‌లో కామెంట్ చేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ సెలక్షన్ కోసం ఆడుతున్నాడ‌ని, శ‌భాష్‌.. మెద‌డులో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆలోచ‌న‌లు ర‌గులుతున్నాయ‌ని, శ‌భాష్ డీకే .. నువ్వు వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడాలంటూ అంటూ దినేశ్ కార్తీక్‌ను రోహిత్ శ‌ర్మ ప్రోత్స‌హించాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ కే సెల‌క్ష‌న్ కే లియే పుష్ క‌ర్నా హై ఇస్కో, శ‌భాష్‌. దిమాగ్ మే చెల్ ర‌హా హై ఇస్కీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌. శ‌భాష్ డీకే. వ‌ర‌ల్డ్‌క‌ప్ కేల్నాహై అని హిందీలో దినేశ్ కార్తీక్‌ను రోహిత్ ప్ర‌శంసించాడు.

Spread the love