ప్రియుడి ప్రయివేట్ పార్ట్ కోసేసిన ప్రేయసి..

నవతెలంగాణ – బీహర్: బీహార్‌లోని చాప్రా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా డాక్టర్ తన ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ అతని ప్రయివేట్ పార్ట్ కోసేసింది. యువతి చాప్రాలోని మధుర ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేస్తోంది. అదే ప్రాంతానికి చెందిన వార్డ్ కౌన్సిలర్ వేద్ ప్రకాష్‌తో రెండేళ్ల క్రితం యువతికి పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ అమ్మాయితో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. రెండేళ్లుగా వీరి సంబంధం కొనసాగుతూ వస్తుండగా.. ఇటీవలి కాలంలో పెళ్లి అంశాన్ని ప్రస్తావించింది యువతి. రేపు, మాపు అంటూ కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తాజాగా పెళ్లి చేసుకుంటావా? లేదా? అని ప్రశ్నించగా.. చేసుకోనని స్పష్టం చేశాడు. దీంతో అతనికి ఎలాగైన బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయిన యువతి.. అతన్ని తన ఇంటికి పిలిపించింది. అతనితో రొమాన్స్ చేస్తూనే.. అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. తన వద్ద ఉన్న ఆపరేషన్ కత్తితో ప్రయివేట్ పార్ట్ కోసేసింది. దీంతో అతను పెద్ద ఎత్తున అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కన వారు వచ్చారు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. యువతిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. తనలా మరే యువతి మోసపోకూడదనే ఉద్దేశంతోనే అలా అతని ప్రయివేట్ పార్ట్ కట్ చేశానని యువతి వాంగ్మూలం ఇచ్చింది. యువతిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Spread the love