బాలికలు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి: కడియం కావ్య

నవతెలంగాణ – ధర్మసాగర్
బాలికలు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కడియం ఫౌండేషన్ చైర్మన్ కడియం కావ్య అన్నారు. మండలంలోని ముప్పారం గ్రామంలో కేజీబీవీ పాఠశాలలో బాలికల దినోత్సవ కార్యక్రమం స్పెషల్ ఆఫీసర్ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధర్మసాగర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆసనాల శ్రీనివాస్, కడియం కావ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మహిళను ఉద్దేశించి మాట్లాడుతూ బాలికలు ఉన్నత శిఖరాలు చేరుకోవాలంటే అది కేవలం చదువుతూనే సాధ్యమని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్ ఆసనాల శ్రీనివాస్ మాట్లాడుతూ బాలికలు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని కష్టపడి చదివి బాలిక సాధికారతను సాధించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి గోనెల సమ్మక్క, కళాశాల అధ్యాపకులు జ్యోతి, ఉపాధ్యాయులు సువర్ణ, ప్రసన్న, సుమ, దేవరాని, శిరీష, సరిత, పద్మ, కృష్ణవేణి, కవిత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love