ఒక్క అవకాశం భీంభరత్‌కు ఇవ్వండి

– సర్పంచ్‌ బండారు శైలజ ఆగిరెడ్డి
నవతెలంగాణ-చేవెళ్ల
ఎమ్మెల్యేగా పామెన భీంభరత్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని చేవెళ్ల గ్రామ సర్పంచ్‌ బండారు శైలజ ఆగిరెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్లు దేవర వెంకట్‌రెడ్డి, గోనె ప్రతాప్‌రెడ్డి అన్నారు. సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కరెడ్డిగూడ, చన్‌వెల్లి తదితర గ్రామాల్లోని పలు కాలనీలలో ఇంటింటికీ తిరుగుతూ ఆరు గ్యారంటి పథకాలపై అవగాహన కల్పించి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీంభరత్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో చన్‌వెల్లి ఎంపీటీసీ సభ్యురాలు మమత భూపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, సోమ బలవంత్‌రెడ్డి, పి. రఘురాంరెడ్డి, బి.కార్తీక్‌ రెడ్డి, ఎస్‌.ప్రవీణ్‌రెడ్డి, సి.ఇంద్రాసేన రెడ్డి, కోమటి శ్రీనివాస్‌, కె. శ్రీకాంత్‌రెడ్డి, బి.మహేష్‌రెడ్డి, ఎస్‌. వినరు కుమార్‌రెడ్డి, చిరుమాని మహేందర్‌రెడ్డి, పి.దయాకర్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి, టి. రఘు, కురువ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love