గృహజ్యోతి పథకానికి పత్రాలు ఇవ్వండి

నవతెలంగాణ – భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా విద్యుత్ అధికారులు గృహ అవసరాలకు విద్యుత్ ను వినియోగిస్తున్న వినియోగదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సెల్ ఫోన్ నెంబర్ ను కరెంటు బిల్లు ఇచ్చే విద్యుత్ సిబ్బందికి అందజేయాలని విద్యుత్ ఏఈ సంకీర్త ఒక ప్రకటనలో తెలిపారు. గృహజ్యోతి పథకం కేవలం గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్తుకు మాత్రమే వర్తిస్తుందని, ఒక రేషన్ కార్డుకు ఒక్క విద్యుత్ మీటర్ కు మాత్రమే ఉచిత విద్యుత్ ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు కరెంటు బిల్లు ఇచ్చే విద్యుత్ సిబ్బందికి పత్రాలు అందజేయాలని సూచించారు. విద్యుత్ మీటర్లకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు లింకు అయిన తర్వాత ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ అమలవుతుందని తెలిపారు.
Spread the love