నవతెలంగాణ-తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గం లో 9 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థి కడియం రామచంద్రయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మున్సిపల్ పరిధి నందాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించి మాట్లాడుతూ కరోనా సమయం నుండి ప్రజలందరికీ డిసెంబర్ 2028 వరకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజానీకానికి ఇంతవరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. మిగులు తెలంగాణను అప్పుల తెలంగాణ గా మార్చిన కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. బిజెపి అధికారంలో వస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. నిరుపేదలందరికీ రేషన్ కార్డు అందిస్తామన్నారు. 80 వేల పుస్తకాలు చదివిన ఇంజనీర్ కేసీఆర్ కట్టిన మేడిగడ్డ కాళేశ్వరం కృంగిపోయి లక్షల కోట్లు నీళ్ల పాలయి కమిషన్ల పాలయిందన్నారు. దయచేసి ఓటరు మహాశయులారా ఆలోచించి ఒక్కసారి బిజెపికి అవకాశం ఇచ్చి కమలం పువ్వు గుర్తుకు ఓటు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బిజెపి నాయకులు భూతం సాగర్, మేడ బోయిన యాదగిరి, దీన దయాల్, బంగారు రాజు హనుమంతు తదితర నాయకులు పాల్గొన్నారు.