వైభవంగా ముత్యాలమ్మ బోనాల పండుగ

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని గండివేట్ గ్రామంలో ముత్యాలమ్మకు బోనాల పండుగను అంగరంగా వైభవంగా నిర్వహించారు. ఊరు ఊరంతా అమ్మవారికి బోనాల ను సమర్పించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బోనాలతో ఊరేగించారు. అమ్మవారి నామస్మరణతో పుర వీధులు మార్మోగాయి. డీజే పాటలతో హోరెత్తింది డప్పుల చప్పులతో ఆటపాటలతో భక్తులు తన్మయత్వం పొందారు. అందరినీ చల్లంగా చూడాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు, మాజీ ప్రజ ప్రతి నిధులు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love