
– నేషనల్ కరాటే చాంపియన్ లో పోటీల్లో చాటిన ప్రతిభ
నవతెలంగాణ-ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం వెల్టూరు పరిధిలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకులాల బాలికలు హైదరాబాద్‌లో జరిగిన జి ఆర్ మెమోరియల్ 3వ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025లో హైదరాబాద్ పాఠశాలలోని ఇతర విద్యార్థులతో పోటీపడి అద్భుతంగా ప్రదర్శన సృష్టించి ఉప్పునుంతల గురుకులానికి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినట్లు బుధవారం గురుకుల ప్రిన్సిపాల్ ఆర్. యామిని తెలిపారు.
వీరే స్వర్ణ ప్రతిభాలు
ఎస్.బిందు 8వ తరగతి మూడు రౌండ్ల ఫైట్‌లో కుమిటే (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానంలో బంగారు పతకాలు సాధించింది,
డి.లావణ్య 7వ తరగతి కూడా కుమిటే (ఫైట్) మూడు రౌండ్ల ఫైట్, (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానం బంగారు పతకాలు సాధించింది.
సి. రాణి – 8వ తరగతి ఉన్నత (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానం బంగారు పతకం సాధించింది.
ఎస్.శివాని -8వ తరగతి (ఫైట్ స్కిల్స్)లో 1 ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించింది.
ఎస్.నందిని – 8వ తరగతి 1వ స్థానం బంగారు పతకం (ఫైట్ స్కిల్స్) సాధించింది.
జి. వర్షిత – 8వ తరగతి (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానం బంగారు పతకం సాధించింది.
టి.నాగవైష్ణవి -7వ తరగతి (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానం బంగారు పతకం పొందింది.
టి.అరిష – 8వ తరగతి (ఫైట్ స్కిల్స్)లో 1వ స్థానం బంగారు పతకం సాధించింది.
జి.సాక్షిక -7వ తరగతి ఖాతాల 1వ స్థానం బంగారు పతకం పొందింది.
కె. శ్వేత – 7వ తరగతి 1వ స్థానం బంగారు పతకం సాధించింది.