– మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– బీజేపీ, ఆటో యూనియన్ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరిక
నవతెలంగా-మహేశ్వరం
బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు సుపరి పాలన లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇం ద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం -బీజేవైఎం నాయకుడు రమేశ్ తన అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మినాజ్ పటేల్ ఆధ్వర్యంలో 16 మంది ఆటో యూనియన్ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. నియోజక వర్గం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటు న్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌తోనేే సబ్బండ వర్గాలకు స ముచిత స్థానం దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయ కత్వంలో సంక్షేమ ఫలాలు రాజకీయాలకు అతీతంగా లబ్ది చేకూరుతున్నాయని అన్నారు. బీఆర్‌ఎస్ అంటేనే ప్రజలకు భద్రత అన్నారు. దేశంలో ఎక్కడ లేని విదంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా ప్రజలు బీఆర్‌ఎస్ వైపే ఉంటారని ఆమె తెలిపారు. కష్టాల కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే. స్థితిలో లేరని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి పక్షాలకు దిమ్మ తిరుగుతుందని అన్నారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే నియోజకవర్గం అన్నిరంగా లలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారులో ఎస్‌కే సలీం, లడ్డు ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే ఆజాం పాల్గొన్నారు.