రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి ‘పీఎం కిసాన్’ డ‌బ్బులు

నవతెలంగాణ – హైదరాబాద్: నేడు 17వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు. మోడీ వారణాసిలో పర్యటించనున్న క్రమం 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.20 వేల కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు 30వేలకు పైగా స్వయం సహాయక బృందాలకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కాగా రైతులకు కేంద్రం ఏటా మూడు విడతల్లో రూ.6వేలు నగదు సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Spread the love