బీజేపీలో గోషామహల్ గోడు వినిపిస్తున్నది. ఎక్కడ చెడితో తెలియదు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం ‘తగ్గేదెలే లే’ అన్నట్టు సొంత పార్టీ నేతలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ పార్టీ నేతలపై హాట్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలో దారులు మూసుకుపోతున్నాయనే చర్చ జరుగుతున్నది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాజాసింగ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్టుమంటుంది. అయినా సరే బీజేపీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేయడం లేదు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా నేనేందుకు పోతా అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారు. అన్ని దారు లను మూసివేస్తే ఆయనే ఏదో దారి వెత్కుకుని పోతారనే ఉద్దేశంతో పార్టీ నేతలు ఉన్నారు. కానీ ఆయన బయట ఉండి నేతల తీరును ఎండగడుతున్నారు. ఆ పార్టీలో ఎప్పటివరకు ఈ పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఇంకా ఎన్నీ మాటలు వినాల్సి వస్తుందో తెలియదు. అయితే ఆయన రాజకీయ ప్రస్తానం టీడీపీలో మొదలైంది. టీడీపీ, బీజేపీ పార్టీల్లో ఆయన కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మనస్త త్వానికి అనుకూలంగాఉన్న బీజేపీలో ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.ఆయన ఇతర పార్టీల్లోకి పోతారా? లేదా అనేది చూడాల్సిందే.
– ఎస్.వెంకన్న