నూతన న్యాయవాదిగా గొట్టిపాముల శరణ్య..

Gottipamula Sharanya as a new lawyer..నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి జిల్లా బార్ అసోసియేషన్ హాలులో నూతన న్యాయవాది గొట్టిపాముల శరణ్య  పరిచయ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ.. సీనియర్ న్యాయవాది గొట్టిపాముల బాబురావు  కూతురు శరణ్య నాయవాదిగా పరిచయం కావడం న్యాయ వృత్తిని కొనసాగించడం ఆశించదగిన పరినామమని, న్యాయవాద వృత్తిలో ఆమె ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వాదించారు. పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు. గతంలో న్యాయవాద వృత్తిలో 34 సంవత్సరాలు పేద ప్రజలకు అండగా నిలబడిన తండ్రి ఆశయం నిలబెట్టాలని కోరుకున్నారు.  ఈ కార్యక్రమానికి  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాధ్,ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జూకంటి రవి ,సీనియర్ న్యాయవాదులు గొట్టిపాముల బాబురావు,వంచ దామోధర్ రెడ్డి,నాగారం అంజయ్య, నక్కల మల్లేష్,విజయ భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీధర్,లింగా రెడ్డి, జి,రవిందర్ రెడ్డి,గుండ్ల స్వామి,రాజి రెడ్డి,  జయ,హ్తెకోర్టు సీనియర్ న్యాయవాది సురేష్, జిల్ల కోర్టు పిపి శ్రీనివాస్ రెడ్డి, సుదగాని రవి కుమార్,కుక్కదువ్వు సోమయ్య తదితర జూనియర్ న్యాయవాదులు,సీనియర్ జర్నలిస్టు ఎర్ర జాన్సన్ హాజర్తె ఆమెను ఆశీర్వదించారు పాల్గొన్నారు.
Spread the love