
నవతెలంగాణ – కంటేశ్వర్
గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులపై ప్రభుత్వం ఒత్తిడి బెదిరింపులు మానుకోవాలని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల సమ్మె తీవ్రతరం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం కార్మికులను సమ్మె విరమించాలని బెదిరింపులకు పాల్పడం సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. 4వ రోజు సమ్మెలో పాల్గొని నూర్జహాన్ మాట్లాడుతూ..గ్రామపంచాయతీ కార్మికులలో అత్యధికులు దళితులు కావడం వల్లే ప్రభుత్వం చర్చలకు పిలవకుండా వివక్ష పాటిస్తుందని తక్షణమే జేఏసిని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని గ్రామ పంచాయితీ సిఐటియు జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. రెంజల్ మండలం ఎంపీడీఓ కార్యాలయంవద్ద గ్రామ పంచాయితి కార్మికుల 4 రోజు సమ్మెను వారు ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు కరోనా వంటి కష్ట కాలంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పల్లెలను పరిశుభ్రంగా ఉంచారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి ఒకే కార్మికుడికి అనేక రకాల పనులు అప్పగించి పని భారం పెంచిందన్నారు తక్షణమే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు .రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు పలుమార్లు అనేక వాగ్దానాలు చేసిందన్నారు. వాటిని నిలబెట్టుకోకపోవడం వల్లే కార్మికుల సమ్మెకు దిగారన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. అత్యంత ఎక్కువ పెట్టి చాకిరి చేస్తున్నా పంచాయతీ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26000రూ. లకు పెంచాలన్నారు ముఖ్యమంత్రి గారి వాగ్దానం మేరకు పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు ప్రమాదవశాత్తు మరణిస్తే పైసా రావటం లేదన్నారు కార్మికులకు ప్రమాద బీమా పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు ప్రభుత్వం కార్మికులన్న బెదిరించడం మానుకొని జేఏసీ ని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలన్నారు బెదిరింపులకు కార్మికులు భయపడరని గతంలో అనేక సమ్మేలు చేసినా అనుభవం ఉందన్నారు గత అనుభవం అంతా పోరాటాల వల్లే సమస్యలు పరిష్కరించబడ్డాయని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పసియోద్దీన్ గంగారం సాయిలు లచ్చవ్వ సాయమ్మ నాగమణి అక్తర్ తదితరులు పాల్గొన్నారు.