బెంగాలీలకు రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు గవర్నర్‌ తమిళిసై

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో స్థిరపడ్డ ఎనిమిది లక్షల మంది బెంగాలీలకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పశ్చిమబెంగాల్‌ రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వించారు. ఈ కార్యక్రమంలో ఆయా బెంగాలీ అసోసియేషన్ల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గీతాలను కళాకారులు ఆలపించారు. గవర్నర్‌ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధిలో బెంగాలీలు భాగమయ్యారని గుర్తు చేశారు. నిజాం కాలేజీ మొదటి ప్రిన్సిపాల్‌ అఘోర నాథ్‌ ఛటోపాధ్యాయ, ఆయన పిల్లలు హరింద్రనాథ్‌ ఛటోపాధ్యాయ, సరోజినీ నాయుడు తమ గోల్డెన్‌ త్రిషోల్డ్‌ ఇంటిని 1974లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వివిధ రంగాల్లో సేవలందిం చిన బెంగాలీ ప్రముఖులను గుర్తుచేసుకున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యోగా, ధాన్యం, ప్రాణాయామాలు కోవిడ్‌-19 వల్ల ఏర్పడిన మానసిక, శారీరక ప్రభావాలను అధిగమించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.

Spread the love