ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వ

– సీఐటీయూ ఆధ్వర్యంలో దిష్టి బొమ్మ దహనం
– ఆశా వర్కర్లు అంటే అంత భయమెందుకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి..? 
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ- కంటేశ్వర్
ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులను వ్యతిరేకంగా ప్రభుత్వం సిఐటియు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ మేరకు సోమవారం ఆశ వర్కర్లు అంటే అంతా భయమెందుకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ఆశ వర్కర్లను అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. చలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాని అడుక్కోవడానికి విచ్ఛిన్నం చేయడానికి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆశ వర్కర్లను అందరిని అరెస్టు చేశారు క్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులతోటి ఉద్యమాలని ఆపలేరని అన్నారు. ఆశా వర్కర్లు కి ఫిక్స్ డ్ వేతనం రూ 18 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం అదనపు పని భారాన్ని తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకు హైద్రాబాద్ లోని కమిషనర్ కార్యాలయం ధర్నాకు ఆశా వర్కర్లు అంతా బయలు దేరి వెళ్తుంటే రైల్వే స్టేషన్లో పోలీసులు ఆశా వర్కర్లు ని ట్రైన్ నుండి దింపేసి,వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా పోరాటాలను చేసే వాళ్ళని నిర్బంధించాలని చూస్తుంది. ఇది సరైనది కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆయూశ వర్కర్ల సమస్యలను పరిష్కారం చెయ్యకపోతే పోరాటాలను ఉదృతం చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమంలో రేణుక సుకన్య రేవతి లలిత రాదా తదితరులు పాల్గొన్నారు.
Spread the love