ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) అర్హుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 261. పోస్టుల వారీగా ఖాళీలు: ఎయిర్‌ వర్దీనెస్‌ ఆఫీసర్‌- 80, ఎయిర్‌ సేఫ్టీ ఆఫీసర్‌- 40, లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌- 06, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌- 05, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌- 23, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్‌- 86, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ గ్రేడ్‌ 1- 03, అసిస్టెంట్‌ సర్వే ఆఫీసర్‌- 07, ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌- 01, సీనియర్‌ లెక్చరర్‌- 06
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-07-2023. వెబ్‌సైట్‌: https://upsc.gov.in/
బెల్‌-బెంగళూరులో ఇంజినీర్‌ ఖాళీలు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 27 ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌.
అనుభవం: కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.40000 చెల్లిస్తారు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.472.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.
చిరునామా: MANAGER (HR/ADSN, ES & C-QA) Bharat Electronics Limited Jalahalli P.O., Bengaluru 560013.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.07.2023.
వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

పీజేటీఎస్‌ఏయూలోయూజీ కోర్సులో ప్రవేశాలు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ, శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్శిటీలతోపాటు అనుబంధ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి బైపీసీ స్ట్రీమ్‌లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది.
డిగ్రీ కోర్సులు-సీట్ల వివరాలు : బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ (నాలుగేళ్లు)-720 సీట్లు, బీఎస్సీ (ఆనర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ (నాలుగేళ్లు)-43 సీట్లు, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ (ఐదున్నరేళ్లు)-174 సీట్లు, బీఎఫ్‌ఎస్సీ (నాలుగేళ్లు)-39 సీట్లు, బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ (నాలుగేళ్లు)-204 సీట్లు
అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజికల్‌ సైన్సెస్‌, బయోలాజికల్‌ సైన్సెస్‌)తోపాటు టీఎస్‌ ఎంసెట్‌-2023 ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: బీవీఎస్సీ ఏహెచ్‌ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్లు, ఇతర కోర్సులకు 17 – 22 ఏళ్లు.
ఎంపిక: టీఎస్‌ ఎంసెట్‌-2023లో అభ్యర్థులు పొందిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 17.07.2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 18.07.2023 నుంచి 19.07.2023 వరకు
వెబ్‌సైట్‌:https://www.pjtsau.edu.in/

ఎఫ్సీఆర్‌ఐ, ములుగులో బీఎస్సీ ఫారెస్ట్రీ ప్రవేశాలు
సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్రీ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌.. 2023 24 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్‌) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: ఇంటర్మీడియట్‌(పీసీబీ/పీసీఎం/పీసీఎంబీ)తో పాటు టీఎస్‌ ఎంసెట్‌ – 2023 ర్యాంకు సాధించి ఉండాలి.
ప్రవేశ విధానం: టీఎస్‌ ఎంసెట్‌ 2023 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.07.2023
రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.07.2023.
www.fcrits.in

Spread the love