కరాటేతో మనోధైర్యం.. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
కరాటే నేర్చుకోవడం వలన శరీర అవయవలు గట్టిపడడమే కాకుండా మనోధైర్యం కలిగి ఉంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇటీవల కరీంనగర్  లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ప్రతిభా కనబరిచిన మెడల్స్ సాధించిన  విద్యార్థులతో పాటు  అలాగే  సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొంది కరాటే లో చక్కటి విన్యాసాలు  ప్రదర్శించి వివిధ స్థాయి బెల్టులు సాధించిన 40 మంది విద్యార్థులను శుక్రవారం ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో ఆది శ్రీనివాస్  అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పాఠశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థి ఆ త్మరక్షణకై కరాటే నేర్చుకోవాలని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం ఏకాగ్రతతో సాధన చేయాలని ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒ కి నావా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నాన్,  కరాటే కోచ్ కనికరపు  రాజశేఖర్, తల్లిదండ్రులు ఉన్నారు.
Spread the love