ఘనంగా దండు రమేష్ పుట్టినరోజు వేడుకలు..

– ముఖ్య అదితిగా హాజరైన దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు, తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ పుట్టినరోజు వేడుకలు శనివారం కాటారం కేంద్రంలోని ధన్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై రమేష్ ను ఆశీర్వదించారు.ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,ఆయురారోగ్యాలతో, దేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు స్వీట్స్ పంచారు.ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love