నవతెలంగాణ – తొర్రూర్ రూరల్
గాంధీజీ వర్ధంతి వేడుకలు ఘనంగా మండలంలోని రామన్నగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో మహాత్మా గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది గాంధీజీ స్వాతంత్ర ఉద్యమంలో నిర్వహించిన పాత్ర చాలా అమోఘమైనదని ధరిత్రిపై చరిత్ర ఉన్నంతకాలం మహాత్మా గాంధీ జీవించేయుంటాడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మత్స సోమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గాంధీ కి ఘనమైన నివాళి అర్పించారు. పాఠశాల ఉపాధ్యాయులు గుగులోతు బాలు, బాతుక బుచ్చి రామయ్య, దాసరి యాదగిరి, బొమ్మన బోయిన రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.