- Advertisement -
భక్త మార్కండేయ కమిటీ సభ్యులు
నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో పద్మశాలి సంఘం తో పాటు వివిధ కులాలు వనంలోకి పోయి వనభోజనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లికుదురు గ్రామ శివ పర్వతి సమేత భక్త మార్కండేయ దేవాలయ కమిటీ నాయకులు మాట్లాడుతూ.. ఈ ఆషాడ మాసంలో అడవి అనగా ఊరు బయట వనం లోకి కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు వనభోజనం చేస్తే వారి కుటుంబ అభివృద్ధి చెందుతూ రోగాలను దగ్గర రాకుండా చూడాలని, వర్షాలు అధికంగా గురించి పాడి పంటలు చల్లగా ఉండాలని, ఉద్దేశంతో ఈ వనభోజనానికి వెళ్ళమని అన్నారు. వన భోజనానికి వెళ్ళినప్పుడు వన దేవతలు ఆశీర్వదిస్తారని, నమ్మకంతో వనభోజనానికి వెళుతున్నామని తెలిపారు.
- Advertisement -



