నవతెలంగాణ-భిక్కనూర్ : భిక్నూర్ మండల కేంద్రంలో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీం రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలు గురించి, బడుగు బలహీన వర్గాలకు అందించిన పథకాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజి రెడ్డి, పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, కంచర్ల ఎంపిటిసి మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి, లింబాద్రి, సిద్ధ గౌడ్, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.