నవతెలంగాణ – మిడ్జిల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగల కు తగిలి గడ్డి ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైన సంఘటన వెలుగోముల గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుంత కోడూరు గ్రామానికి చెందిన కురువ చిన్న మల్లేష్ బంధువులైన వెలుగోముల గ్రామానికి చెందిన బిర్లా నాగయ్య వ్యవసాయ పొలంలో ట్రాక్టర్లో గడ్డి చుట్టాలు నింపుకొని వెళ్తుండగా రోడ్డుపై ఉన్న విద్యుత్ ఎల్ టి తీగలకు తగిలి ట్రాక్టర్ ఇంజన్ తో పాటు ట్రాలీ గడ్డి పూర్తిగా కాలిపోవడంతో చుట్టుపక్కల ఉన్న రైతులు బోరు మోటర్ నీళ్లతో మంటలు అర్పిన ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వపరంగా రైతు మల్లేష్ ను ఆదుకోవాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు.
విద్యుత్ వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ దగ్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



