భారతీయ జనతా పార్టీ, ఉత్తరప్రదేశ్లోని ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంత తీవ్రంగా తంటాలు పడినప్పటికీ హిందూత్వ కూటమికి సంబంధించిన ఒక పెద్ద కుంభకోణం బద్దలైంది. గత రెండున్నర దశాబ్దాలుగా ఏదైనా రాసుకోగల ఒక ఖాళీ చెక్కు కాగితంలా సంఘ పరివార్ అతి పెద్ద రాజకీయ పథకం ఏదైతే నడిపించిందో…అది అంతిమంగా వారికి అతి పెద్ద తలవంపు తతంగంగా పరిణమించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దాని సైద్ధాంతిక సేవాశక్తుల దొంగతనం గురించి, నిధుల గల్లంతు గురించి అధికార వర్గాలలో గుసగుసలు సాగుతుండేవి. ఇక ఇప్పుడది నిస్సందేహంగా రుజువైపోయింది. అయోధ్య రామ మందిరం మూల విరాట్ల కోసం సమర్పించిన నిధులు, విలువైన ఆభరణాలు ఎప్పటికప్పుడు క్రమపద్ధతిలో కొల్ల గొట్టబడ్డాయి. ఈ నిరంతర దొంగతనాలను పట్టించుకోకపోవడం, దాచిపెట్టడం కూడా ‘సిట్’ కొంత వివరం గానే పేర్కొన్నది. ఆ ‘సిట్’ను కూడా జరిగిన తప్పులు, అనివార్య పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం నియమించవలసి వచ్చింది. చోరీకి గురైన కొంత సొత్తును తిరిగి రాబట్టడం ప్రాథమికంగా పూర్తయిందని కూడా మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే అంత దారుణమైన నేరస్త చర్య ఇంత దీర్ఘకాలం పాటు జరుగుతుంటే ఎవరూ గమనించకపోవడం ఎలా సాధ్యమైందన్నదే ఇప్పటికీ స్పష్టంగాని విషయం. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట’లో పైస్థాయి వారికి తెలియకుండా ఇది సాధ్యపడి వుంటుందా అనేది మరో ప్రశ్న.
విశ్వాసాలపై వేటు
దేవుడికి సమర్పించిన నగదు, నగలు దొంగతనం చేయడమే ఒక తీవ్రమైన విషయం. అయితే కోట్లాది మంది భక్తుల నమ్మకాలను దెబ్బతీయడం అంతకన్నా తీవ్రమైన అంశం. రామ జన్మ భూమి ఉద్యమ చరిత్ర ఇప్పుడు స్పష్టంగా బోధపడుతున్నది. భారత్ వంటి దేశంలో ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడంలో ఇంకా చెప్పాలంటే రాజకీయాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో విశ్వాసానికి గల స్థానాన్ని ఎవరూ తోసిపుచ్చలేరు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ దాని హిందూత్వ ధర్మానికి రామజన్మ భూమి ఉద్యమం ఒక వేగుచుక్కలా పనిచేసింది. మున్నెన్నడూ ఎరగని స్థాయిలో – రాజకీయ ఎన్నికల లబ్ధి కోసం ప్రజల మత భావాలనూ చిట్టచివరి బొట్లు దాకా దుర్వినియోగపర్చడం గడచిన కాలపు ప్రప్రధాన లక్షణం. ఆరెస్సెస్‌తో పాటు విశ్వ హిందూ పరిషత్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆఖరుకు అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా ఈ దారుణ పరిణామాలకు బాధ్యత నుంచి తప్పించుకోలేవు.
ఆ ఆలయ భూమిని స్వాధీనంలోకి తెచ్చుకోవడమే విధ్వంసకాండ ద్వారా జరిగిందనే వాస్తవాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తన ఉత్తర్వులో పొందుపర్చారు. ఈ ఉత్తర్వు మోస పూరిత స్వభావం, పచ్చి పరస్పర వైరుధ్యాలు మాలో చాలా మందిమి ప్రత్యేకించి వామపక్షం వ్యాఖ్యానించేలా చేశాయి. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ న్యాయ వివాదానికి ముగింపు పలకడం జరిగినా న్యాయమైతే లభించలేదు. ఆఖరుకు జస్టిస్ చంద్రచూడ్ కూడా తన ఉత్తర్వును న్యాయపరమైన రాజ్యాంగ సూత్రాల ప్రాతిపదికన సమర్థించుకోలేకపోయారు. అందువల్లనే ఆయన దైవ సంకల్పం జోక్యంతో ఆ భూమి యాజమాన్యాన్ని ఎవరైతే విధ్వంసకులో వారికే కేటాయించినట్టు సమర్థించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ట్రస్టు ఏర్పాటుకు సుప్రీంకోర్టు దారిచూపించి. ట్రస్టు ఏర్పాటుకు సహకరించాలనీ, ఆలయ నిర్మాణం నిర్వహణ బాధ్యతలు అది స్వతంత్రంగా చేసేలా చూడాలని సుప్రీంకోర్టు నిర్దిష్టంగా ఆదేశించింది.
సర్వం మోడీగా…
అయితే మోడీ ప్రభుత్వంలో స్వతంత్రత అనేది కేవలం ఒక భ్రాంతి అని స్వతంత్ర పరిశీలకులు ఎవరికైనా తెలుసు. స్వయం ప్రకటిత స్వయం సేవకుడు ప్రధాన మంత్రిగా వుండగా బొత్తిగా పొసగని పదం అది. ఆరెస్సెస్‌కే ప్రప్రధాన కేంద్ర పాత్ర అనేది నిస్సందేహంగా నిజం. కొంతమంది పరిశీలకులు వ్యాఖ్యా నించినట్టుగా దానిలో పని విభజన పద్ధతి వుంటుంది. అలాంటి పని విభజనలతో వేతనాలు, దాని ప్రయో జనాలు వీహెచ్‌పీకి ప్రాప్తించాయి. అదే రామ జన్మభూమి ఉద్యమానికి అగ్రభాగాన వుండి నాయకత్వం వహించింది. అందువల్ల ట్రస్టు ఏర్పాటు తీరు ఎలా జరిగి వుంటుందనేది ఎవరైనా ఊహించవచ్చు. వారే ఎంపిక చేసిన సభ్యులలోనూ కేంద్ర ప్రభుత్వం తరపున వున్నది జ్ఞానేశ్ కుమార్, అంటే ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి. ఎన్నికల సంఘం ఈ సమయంలో బిజెపి తో జట్టు కట్టడానికి కారణమేమిటో దీన్ని బట్టే తెలుస్తుంది.
ఆరెస్సెస్-బీజేపీల జోక్యం
కేవలం ట్రస్టు ఏర్పాటుకే పరిమితం కాలేదు. ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజారోహణం జ్ఞాపకం చేసుకుంటే అన్నీ స్వయంగా ప్రధాని చేతుల మీదుగానే జరిగాయి. ఆమూలాగ్రం మతపరమైన వేడుకలో నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర కొంతమంది శంకరాచార్యలతో సహా ఆక్షేపణలను ఎదుర్కొన్నది. పన్నెండేండ్ల మోడీ పాలన విజయాలలో కచ్చితంగా అయోధ్య భవ్య రామమందిర నిర్మాణం వుంటుంది. ప్రధానమంత్రి అనే ఒక వ్యక్తిలోనే మత విశ్వాసాధిపతి, రాజకీయాధిపతి పాత్రలు సమ్మిళితమైనట్టు చూపించడానికి అలాంటి అభివర్ణన అచ్చంగా సరిపోతుంది.
మౌన నరేంద్రుడా?
అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మౌన ముద్ర దాల్చారు. ఆఖరుకు తన ‘ఎక్స్’ వేదిక ద్వారా కూడా ఆయన ఈ దొంగతనంపై విచారం వ్యక్తపర్చలేదు. ఏమైనా ప్రస్తుత దారుణ ఘటన అంతకన్నా తీవ్రమైంది. 2020లోనే ఇంకా ఆలయ నిర్మాణం మొదలు కాకముందే ఒక ఆడిట్ నివేదిక ఈ కార్యక్రమం ఖాతాల తీరును తప్పు పట్టి నట్టు చెబుతున్నారు. ఆయన పాలనలో పరిపాటిగా మారిన మరికొన్ని లక్షణాలు కూడా కనిపించాయి. అవే పారదర్శకత, జవాబుదారీతనం బొత్తిగా లోపించడం. దీన్ని తొక్కి పట్టేందుకు బడా మీడియా ఎంతో అవస్థ పడినా ఆ నివేదికలు బయిటకు రానే వచ్చాయి. అక్కడ ఎలాంటి పర్యవేక్షణా వ్యవస్థ లేదని స్పష్టమైపోయింది. నిందితులలో ఎవరికీ న్యాయపరమైన సహాయం అందకూడదని ఇప్పుడు అయోధ్య బార్ అసోసియేషన్ పైకప్పులు అదిరిపోయేలా ప్రకటిస్తున్నది. విపరీతమైన ఈ సంఘటనా క్రమం గతంలో కొద్దిపాటి సణుగుడుగానైనా వినిపించలేదు. దొంగతనాన్ని దాచిపెట్టడం కోసం సీసీ టీవీ కెమెరాలు కూడా మూసివేసినట్టు ఇప్పుడు బయిటపడింది.
అత్యున్నత స్థాయిలో చేతులు కలపకపోతే ఇవన్నీ జరిగి వుంటాయా? రాష్ట్ర ప్రభుత్వం మొదట ఈ కథనాలను కొట్టిపారేయాలని చూసింది. అయితే తర్వాత పోలీసులను కొంతవరకూ రంగంలోకి దింపడం, ‘సిట్’ను ఏర్పాటు చేయడం అనివార్యమైంది. అయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ట్రస్టుతో అతి సన్నిహితంగా ముడిపడి వున్నారు గనక అధికారులు జరిపే విచారణ దేనికీ విశ్వసనీయత వుండదు. కనక కోట్లాది మంది భక్తుల ఏ విశ్వాసం పేరిటనైతే బీజేపీ ఎన్నికలలో విజయం సాధించిందో…వారి విశ్వాసాలను గౌరవించి తక్షణమే ఒక న్యాయ విచారణకు ఉత్తర్వునివ్వాలి. చట్టబద్ద పాలన, మన రాజ్యాంగం ప్రకారం తీసుకోవలసిన కనీస చర్చ ఇది.
(జులై 1 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
మహా ద్రోహం : దొరికిపోయిన దొంగలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



