ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలోని అమృత హాస్పిటల్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వైద్యులు మండలంలోని మరిపెళ్లి గూడెం గ్రామంలో గురువారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుమారు 80 వేల విలువగల మందులను ఉచితంగా పంపిణీ చేసినట్టు హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా అమృత హాస్పిటల్, ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజ్మెంట్ ఎల్క దేవేందర్ రెడ్డి మాట్లాడారు. పేద ప్రజలకొరకు ముందు ముందు మరిన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.వైద్య శిబిరానికి సహకరించిన గ్రామ పంచాయితి కార్యాలయ నిర్వాహకులకు, పెద్దలకు ఆయన ప్రత్యేక కృత్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సూపర్ స్పెషలిటీ వైద్యులు  నరాల వైద్య నిపుణులు డాక్టర్ భావనా రెడ్డి, గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్, చాతి వైద్య నిపుణులు డాక్టర్ విజేత రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love