కబ్జాచేసి అక్రమ లేఅవుట్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి

– మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి
– సీఎం రేవంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ఫిర్యాదు
నవతెలంగాణ – జమ్మికుంట
 హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములను ,దళిత భూములను కబ్జా చేసి అక్రమ లేఅవుట్స్ చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, వీరికి సహకరిస్తున్న అధికారులపై,  ప్రజాప్రతినిధులపై సమగ్ర విచారణ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర సీఎం  ఏనుమల రేవంత్ రెడ్డి , రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమ్మిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశము ఆయన మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో ధనార్జన     ద్యే యంగా పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరలకు, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు చేస్తూ ప్లాట్లు విక్రయాలు చేస్తున్నారు. వ్యవసాయ భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇట్టి భూమిని నివాసస్థలాలుగా మార్చాలంటే నానా పర్మిషన్ తీసుకొని నాల పనులు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
కానీ తక్కువ భూమిని నాలా పరిమిషన్లో చూపించి ,ఎక్కువ ప్లాట్లు పెట్టి విక్రయాలు చేశారని ఆయన ఆరోపించారు. దీనికి మొత్తం రెవెన్యూ అధికారులు సహకరించడం వలన ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి కొట్టారని ఆయన విమర్శించారు. జమ్మికుంట పట్టణంలోని సర్వేనెంబర్ 887, 629, 865 , 431, 368, 389, 92, 93 మున్సిపల్ పరిధిలోని ధర్మారం, రామన్నపల్లి, ఆ బాది జమ్మికుంట, హుజరాబాద్ రోడ్డు ,కొరపల్లి రోడ్ లో గల భూములను ,ప్రభుత్వ భూములను , శిఖం భూములను కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అక్రమల్లే అవుట్లు చేసి, ప్లాట్లు పెట్టి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన ఆరోపించారు. వీరిని పోలీస్ అధికారులతో కేసులు పెట్టుతామని బెదిరించి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సహకరిస్తున్న అధికారులపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇంత అక్రమ  భూ దందా జరుగుతున్న సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కాక  మునిసిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారని ఆయన విమర్శించారు. దీనికి సంబంధిత రెవెన్యూ, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారుల పైన అలాగే అక్రమ లేఅవుట్లకు దొంగ రిజిస్ట్రేషన్లు చేసిన హుజురాబాద్ సబ్ రిజిస్టర్ పై సమగ్ర విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Spread the love