నైనాల గ్రామ ముదిరాజ్ పెద్దమ్మ గుడి భూమి పూజ కార్యక్రమం

– మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని నైనాల గ్రామంలో ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపాడు. శుక్రవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  మెపా ( ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ..ముదిరాజ్ కులస్తుల ఏ కార్యక్రమం చేసిన కుల  ఆరాధ్య దైవంగా భావించే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని అలాగే అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడు లు నిర్మించుకోవాలని,భవిష్యత్ లో ప్రభుత్వం కూడా అన్ని గ్రామాల్లో పెద్దమ్మ గుడులు అధికారికంగా నిర్మించాలని కోరారు.పెద్దమ్మ గుడులు  ఐక్యమత్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి అని,జాతి ఐక్యత అభివృద్ది కోసం పాటు పడతాయని అన్నారు.ఈ కార్యక్రమం నైనాల గ్రామ ముదిరాజ్ కుల పెద్ద మనిషి తోట ఉప్పలయ్య,మత్స శాఖ అధ్యక్షులు బత్తిని వెంకన్న ల అదర్యంలో, మెపా రాష్ట్ర కార్యదర్శి తోట రమేష్ సలహా మేరకు జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో  మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిరుత వెంకటేశ్వర్లు,మహబూబాబాద్ జిల్లా మెపా ప్రధాన కార్యదర్శి దుండి అశోక్,డివిజన్ అద్యక్షులు సింగాని మహేష్,ముదిరాజ్ మహా సభ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు చిల్ల సహదేవ్, మత్స్య శాఖ చీఫ్ ప్రమోటర్ కొత్తూరు రమేష్, మండలాధ్యక్షుడు  కుక్కల ఐలయ్య, తోట సురేష్, లక్ష్మణ్ మల్లయ్య, దుస్స యాకయ్య నైనాల ముదిరాజ్ సంఘం కుల పెద్దమనిషి  తోట ఉప్పలయ్య, తోట నరసయ్య తోట వెంకన్న, సొసైటీ అధ్యక్షుడు బత్తిని వెంకన్న, ఉపాధ్యక్షుడు నారబోయిన  వెంకన్న, నారబోయిన  మల్లయ్య, తోట యాకయ్య తోట వీరస్వామి, నారబోయిన గుట్టయ్య, తోట అనిల్  గ్రామ ముదిరాజ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
Spread the love