గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి 

– సిద్దిపేట డీపీఓ దేవకీదేవి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
గ్రామాలలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని సిద్దిపేట డిపిఓ దేవకి దేవి అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ సమీకృత  డివిజనల్  కార్యాలయంలో అక్కన్నపేట పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ తాగునీటి పై  ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నీడ, నీరు,ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ,ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామపంచాయతీ పరిధిలో భవనల అనుమతులపై పంచాయతీ కార్యదర్శులను అవగాహన కల్పించారు. పతి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో  డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు  , అక్కన్నపేట ఎంపీడీవో బి జయరాం , పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love