
-వెనుదిరిగిన ఇద్దరు మహిళ అభ్యర్థులు
-161 మంది అభ్యర్థుల గైర్హాజరు
నవతెలంగాణ-బెజ్జంకి
గ్రూప్-4 పరీక్షల నిర్వహణకు మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయం,సత్యసాయి గురుకుల పాఠశాల యందు పరీక్షల నిర్వహణ కేంద్రాలను టీఎస్ పీ ఎస్ సీ ఏర్పాటు చేసింది.శనివారం అయా కేంద్రాల్లో పరీక్షలను అధికారులు పకడ్భందిగా నిర్వహించారు.ఆదర్శ విద్యాలయంలో 336,సత్యసాయి గురుకుల పాఠశాలలో 430 మంది అభ్యర్థులు హజరయ్యేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ నిబంధనలు విధించగా సీఐ జానకి రాంరెడ్డి,ఎస్ఐ ప్రవీన్ రాజు పోలిస్ సిబ్బందితో కలిసి పర్యవేక్షణ చేశారు.ఆదర్శలో 279,సత్యసాయి గురుకులలో 326 మంది పరీక్షలకు హజరవ్వగా 161 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్టు అయా పరీక్షల కేంద్రాల నిర్వహణ అధికారులు తెలిపారు.
గుర్తింపులేక ఒకరు..ఆలస్యమై మరోకరు..
ఆదర్శ విద్యాలయ కేంద్రంలో గ్రూప్-4 పరీక్షలకు హజరయ్యేందుకు హైదరాబాద్ నుండి వచ్చిన ఇద్దరు మహిళ అభ్యర్థులు వెనుదిరిగారు.టీఎస్ పీ ఎస్ సీ సూచించిన ప్రభుత్వ గుర్తింపు అదారం లేక ఒకరు.. ఆలస్యమై మరోకరు పరీక్ష కేంద్రం నుండి వెనుదిరుగడం అభ్యర్థులను కలిచివేసింది.వెనుదిరిగిన వారిలో ఒక మహిళ అభ్యర్థి ఎంతో కాలంగా కష్టపడి చదివి పరీక్షకు హజరయ్యేందుకు వచ్చానని..తన గుర్తింపు కార్డును తీసుకువస్తున్నారని పరీక్ష రాసేందుకు ప్రవేశమివ్వాలని పరీక్ష కేంద్రం నిర్వహణ అధికారులను ప్రాదేయపడిన టీఎస్ పీ ఎస్ సీ నిబంధనలను ఉల్లంఘించలేమని అధికారులు తెలుపడంతో విలపిస్తూ వెనుదిరిగింది.పరీక్ష కేంద్రంలోకి ప్రవేశ సమయం ముగియడంతో మరో మహిళ అభ్యర్థి వెనుదిరిగింది.
పరీక్ష కేంద్రం ఏర్పాటుపై అసంతృప్తి..
మండల కేంద్రానికి అనుబంధ గ్రామమైన ఎల్లంపల్లిలోని ఆదర్శ విద్యాలయంలో టీఎస్ పీ ఎస్ సీ అధికారులు గ్రూప్ -4 పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడంపై పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.పరీక్ష కేంద్రం వద్దకు రవాణ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొన్నామని.. కనీస సౌకర్యాల్లేని విద్యాలయంలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం అనాలోచితమైందని అభ్యర్థుల బంధువులు, సన్నిహితులు వాపోయారు.