చలో కలెక్టరేట్ కు తరలిన గీత కార్మికులు

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
కల్లుగీత కార్మికుల సమస్యలపై కల్లుగీతా కార్మిక సంగం పిలుపుమేరకు సోమవార చలో కలెక్టరేట్ కు గీత కార్మికులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక కార్పొరేషన్లు నిధులు రూ .5000 కోట్ల కేటాయించాలని, ప్రతి గీతా కార్మిక సభ్యునికి ద్విచక్ర వాహనం, నిరుపేద గీత కార్మికులకు లక్ష రూపాయల రుణ సహాయం అందించాలన్నారు. ప్రతి గ్రామంలో కమిటీహలు కు స్థలంతో పాటు రూ.15 లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రతి మండల కేంద్రంలో బీసీ భవనం బీసీ ఫంక్షన్ హాల్, నిర్మించాలని, సొసైటీకి 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పూదరి రవీందర్ గౌడ్ బత్తిని మల్లేశం గౌడ్, కోయడ రమేష్ గౌడ్, రాములు గౌడ్ పచ్చిమట్ల, కక్కర్ల సత్యం గౌడ్, గట్టు మల్లేశం గౌడ్, ఇల్లందుల హర్షయ్య గౌడ్, వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్, సాంబశివుడు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love