Fire TVతో మీ టీవీని కొత్త స్మార్ట్ టీవీ అనుభవానికి అప్‌గ్రేడ్ చేయండి

– Fire TV కస్టమర్‌లు ఇప్పుడు 12,000+ యాప్‌లలో మిలియన్ కంటే ఎక్కువ సినిమాలు మరియు టీవీ షో ఎపిసోడ్‌లను వీక్షించవచ్చు, 70+ లైవ్ ఛానెల్‌లను యాక్సెస్ చేయవచ్చు మరియు ఉచిత/ప్రకటన-మద్దతు ఉన్న వీడియో కంటెంట్‌ను చూడవచ్చు
– వినియోగదారులు Fire TV ద్వారా అందుబాటులో ఉన్న తమకు ఇష్టమైన కంటెంట్‌నుAlexa కు వాయిస్ కమాండ్‌లను అందించటం ద్వారా సెకన్ల వ్యవధిలో శోధించవచ్చు మరియు ప్రసారం చేయవచ్చు
– రాబోయే ప్రైమ్ డేలో (జూలై 15-16),  కస్టమర్‌లు అత్యధికంగా అమ్ముడవుతున్న Fire TV పరికరాలపై గరిష్టంగా 55%  వరకూ తగ్గింపును పొందవచ్చు
హైదరాబాద్- బెంగుళూరు: ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5, జియో సినిమా మొదలైన వాటితో సహా 12,000+ యాప్‌లలో ఇప్పుడు Fire TV  కస్టమర్‌లు మిలియన్ కంటే ఎక్కువ సినిమాలు మరియు టీవీ షో ఎపిసోడ్‌లను వీక్షించగలరని Amazon ప్రకటించింది. MiniTV, YouTube, MX Player, TVFPlay, YuppTV మరియు మరెన్నో ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఉచిత/ప్రకటన-మద్దతు ఉన్న కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. స్ట్రీమింగ్ యాప్‌లతో పాటు, వారి హోమ్ స్క్రీన్‌పై DTH సెట్-టాప్-బాక్స్ నుండి  Fire TV వినియోగదారులు కలర్స్, SET ఇండియా, డిస్కవరీ, న్యూస్18, DD నేషనల్, ఆజ్ తక్, జీ న్యూస్, ఇండియా టుడే మరియు DD నేషనల్ వంటి 70+ లైవ్ ఛానెల్‌లను కూడా యాక్సెస్ చేయగలరు. రాబోయే ప్రైమ్ డే సందర్భంగా, ప్రైమ్ డే 2023లో Fire TV Stick Lite, Fire TV Stick మరియు Fire TV Stick 4K Max వంటి Amazon పరికరాలపై ప్రైమ్ కస్టమర్‌లు 55% తగ్గింపుతో పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు – జూలై 15న మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆఫర్  జూలై 16, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. స్ట్రీమింగ్‌ను సులభతరం చేయడానికి మరియు స్మార్ట్ టీవీ అనుభవానికి అప్‌గ్రేడ్ చేయడానికి Fire TV స్టిక్‌ని HDMI పోర్ట్ ద్వారా ఏదైనా టెలివిజన్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇది వేగవంతంగా యాప్ ను ప్రారంభించటం తో పాటుగా , వేగవంతమైన స్ట్రీమింగ్‌ను సైతం అందిస్తుంది మరియు ప్లేబ్యాక్‌ను నియంత్రించడానికి మరియు వాయిస్ ఆదేశాలతో కంటెంట్‌ను శోధించడానికి Alexa వాయిస్ రిమోట్‌తో వస్తుంది. “భారత వీక్షకుల స్ట్రీమింగ్ ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. నేటి వీక్షకుడు మరిన్ని వీడియో వినోద ఎంపికలు, మెరుగైన శోధన, వ్యక్తిగతీకరించిన సిఫార్సులు, వెబ్ షోలు మరియు DTH మధ్య సౌకర్యవంతమైన ఇంటర్‌ఫేస్ సహా తమ టీవీ హోమ్ స్క్రీన్‌పై  మరిన్నింటి కోసం వెతుకుతున్నారు ” అని  Amazon డివైజెస్ ఇండియా డైరెక్టర్ మరియు కంట్రీ మేనేజర్ పరాగ్ గుప్తా అన్నారు. “Fire TV  పరికరాలతో, కస్టమర్‌లు మెరుగైన ఎంపిక, వేగవంతమైన స్ట్రీమింగ్‌తో తమ వినోద అనుభవాన్ని మెరుగుపరచుకోవచ్చు మరియు Alexaతో తమ స్మార్ట్ హోమ్ జర్నీని కూడా ప్రారంభించవచ్చు. ఇదంతా సులభం మరియు సరసమైనది ” అని అన్నారు. ప్రతి భారతీయ గృహంలో Fire TV  స్టిక్ తప్పనిసరిగా ఉండాలి. టీవీ వీక్షణ అనుభవాన్ని మరింత స్మార్ట్ గా చేయగల  మరికొన్ని ఫీచర్‌లు ఇక్కడ ఉన్నాయి.
జానర్ మరియు కేటగిరీల అంతటా అనేక రకాల యాప్‌లను పొందే అవకాశం : కామెడీ, స్పోర్ట్స్, యాక్షన్, ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్, ప్రయాణం, గేమింగ్, అలాగే పిల్లలకు సంబంధించిన కంటెంట్ వంటి శైలులలో కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి కస్టమర్‌లు సబ్‌స్క్రిప్షన్ లేదా ఉచిత/యాడ్-సపోర్ట్ ఉన్న యాప్‌లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, ఫిట్‌నెస్ ప్రేమికులు తమ లివింగ్ రూమ్ ల  నుండే ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి Cult.fit వంటి యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు. హిల్ క్లైంబ్ రేసింగ్, బీచ్ బగ్గీ రేసింగ్ మరియు లూడో కింగ్ వంటివి అద్భుతమైన గేమింగ్ అనుభవాలను అందిస్తాయి. Fire TV  వినియోగదారులు యూట్యూబ్ కిడ్స్, వూట్ కిడ్స్ మరియు హ్యాపీ కిడ్స్ వంటి యాప్‌ల ద్వారా పిల్లలకు అనుకూలమైన వినోదాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. గత సంవత్సరం Amazon యొక్క Fire TV  స్ట్రీమింగ్ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం, Fire TV  యూజర్లు ఎక్కువగా సెర్చ్ చేసిన కంటెంట్ కామెడీ, హర్రర్ మరియు కార్టూన్‌లు. కంటెంట్‌ను వేగంగా శోధించండి మరియు స్ట్రీమింగ్ చేయండి: కస్టమర్‌లు “Alexa, సెర్చ్ కామెడీ మూవీస్” వంటి సాధారణ వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి యాప్‌లు మరియు కంటెంట్‌ల లైబ్రరీని సౌకర్యవంతంగా నావిగేట్ చేయవచ్చు – మరియు వారి వీక్షణ అనుభవాన్ని మరింత స్పష్టంగా  మరియు సౌకర్యవంతం గా  చేయవచ్చు. Fire TV  స్టిక్ ప్రామాణిక వైఫై కంటే వేగవంతమైన స్ట్రీమింగ్ మరియు అతి కొద్దిగా డ్రాప్ అయినా కనెక్షన్స్ అందిస్తుంది. అదనంగా, Fire TV  స్టిక్‌లో క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉండటంతో, వినియోగదారులు తమకు ఇష్టమైన చలనచిత్రాలు మరియు షోలను త్వరితంగా శోధించవచ్చు మరియు ప్రారంభించవచ్చు మరియు సెకన్ల వ్యవధిలో  యాప్‌ల మధ్య మారవచ్చు.  టీవీ హోమ్ స్క్రీన్ నుండి స్మార్ట్ హోమ్ ఉపకరణాలను నియంత్రించండి: ఇంగ్లీష్, హిందీ మరియు హింగ్లీష్‌లలో Alexa కు సాధారణ వాయిస్ ఆదేశాలతో, కస్టమర్‌లు బల్బులు, ACలు, ఫ్యాన్‌లు, స్మార్ట్ కెమెరా మొదలైన వాటితో సహా అనుకూలమైన స్మార్ట్ హోమ్ పరికరాలను కూడా నియంత్రించవచ్చు. “Alexa , షో మీ మై  స్మార్ట్ హోమ్ డ్యాష్‌బోర్డ్‌ ”  అని చెప్పటం ద్వారా కస్టమర్‌లు Fire TVని తమ స్మార్ట్ హోమ్‌కి హబ్‌గా మార్చుకోవచ్చు.

Spread the love