ఎవల్యూషన్ఎక్స్ డెట్ క్యాపిటల్ నుంచి డెట్ ఫైనాన్సింగ్‌లో లెండింగ్‌కార్ట్ రూ.200 కోట్లు సమీకరించింది

నవతెలంగాణ- ఢీల్లి: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ లెండింగ్‌కార్ట్, వృద్ధి-దశ డెట్ ఫైనాన్సింగ్ ప్లాట్‌ఫామ్ ఎవల్యూషన్ఎక్స్ డెట్ క్యాపిటల్ నుంచి ₹200 కోట్ల దీర్ఘకాలిక రుణ నిధులను సేకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో (FY23) లాభదాయకమైన వార్షిక గణాంకాల వృద్ధికి, భారతదేశం వ్యాప్తంగా అధిక సంఖ్యలో చిన్న, మధ్యతరహా సంస్థలకు (MSME) ఆర్థిక సహకారాన్ని అందించడం ద్వారా తన ప్రధాన వ్యాపార వృద్ధితో పాటు అభివృద్ధి దిశలో కొనసాగేందుకు కంపెనీ ఈ నిధులను వినియోగించుకుంటుంది. లెండింగ్‌కార్ట్ దాని సాంకేతిక సామర్థ్యాలలో పెట్టుబడి పెట్టడాన్ని కొనసాగిస్తుంది. ఇది దాని రుణ వేదికను బలపరుస్తుంది. ఇది భారతదేశంలోని మార్క్యూ బ్యాంకులు మరియు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలతో (NBFC) భాగస్వామ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఈ నిధులు మరియు భాగస్వామ్యాలను ఉపయోగించి, లెండింగ్ కార్ట్ చిన్న, మధ్యతరహా సంస్థలకు (MSME) క్రెడిట్ కార్డ్‌లు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు వ్యక్తిగత రుణాలు, బంగారంపై రుణాలు తదితర కొత్త సేవలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. లెండింగ్‌కార్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ హర్షవర్ధన్ లూనియా మాట్లాడుతూ, “భారతదేశంలో అభివృద్ధి నమోదు చేసుకుంటూ పనిచేస్తున్న కొన్ని లాభదాయకమైన ఫిన్‌టెక్‌లలో ఒకటిగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము. మేము ఎంఎస్ఎంఇ ఫైనాన్స్‌ను సరళీకృతం చేసే దిశలో సేవల్ని కొనసాగిస్తుండడంతో, మా ప్రయాణం తదుపరి దశ కోసం ఎవల్యూషన్ ఎక్స్‌ (‌EvolutionX) వంటి అసాధారణమైన భాగస్వామి సహకారాన్ని అందుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ పెట్టుబడి భారతదేశంలోని ఎంఎస్ఎంఇలకు సేవ చేయడంపై దృష్టి సారించడం ద్వారా మనం ఎంచుకున్న వృద్ధి మార్గాన్ని ధృవీకరించడమే కాకుండా లాభదాయకమైన వృద్ధిపై దృష్టి సారిస్తూ కొత్త మైలురాళ్లను నెలకొల్పేందుకు మాకు సహాయపడుతుంది. ఏళ్ల తరబడి, మేము ఎంఎస్ఎంఇలకు రంగానికి మద్దతు ఇచ్చేందుకు సమర్థవంతమైన మరియు బలమైన సాంకేతికతను నిర్మించాము. పరిశ్రమలో మొదటి ఉత్పత్తులను సృష్టించడం, మా టెక్ స్టాక్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త సవాళ్లను పరిష్కరించాలని చూస్తున్నందున ఈ ఆర్థిక సంవత్సరం (FY24) లెండింగ్‌కార్ట్‌కు ఉత్తేజకరమైన సంవత్సరం కానుంది’’ అని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడికి సంబంధించి ఎవల్యూషన్ఎక్స్ డెట్ క్యాపిటల్ భాగస్వామి రాహుల్ షా మాట్లాడుతూ, “భారతదేశంలో చిన్నా పెద్ద ఎంఎస్ఎంఇ క్రెడిట్ స్థలంలో ఫిన్‌టెక్ ప్లేయర్‌లకు అద్భుతమైన అవకాశాలను మేము చూస్తున్నాము. వినియోగదారులను కలిగి ఉండడం, క్రెడిట్ అండర్‌రైటింగ్ మరియు సేకరణ, అలాగే దాని ప్రముఖ ఉత్పత్తి ఆవిష్కరణ, అనుకూలీకరణ సామర్థ్యాలలో అగ్రగామిగా ఉన్న, ఎండ్-టు-ఎండ్ టెక్ స్టాక్‌తో లెండింగ్‌కార్ట్ మార్కెట్‌ను ముందుకు నడిపిస్తుందని మరియు ఎంఎస్ఎంఇలకు నిధుల అంతరాన్ని పూరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఇది మా మొదటి ఫిన్‌టెక్ పెట్టుబడి మరియు భారతదేశంలో భారీ డిజిటల్ లెండింగ్ స్థలాన్ని ఆవిష్కరించే కంపెనీ ప్రయాణానికి మద్దతు ఇచ్చేందుకు మేము వేచి చూస్తున్నాము’’ అని తెలిపారు.

Spread the love