16వ రోజుకు చేరిన ఆందోళన
ఎనిమిదో రోజు కొనసాగిన
సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని తండ్రి, మాజీ సైనికుడు
రాజేశ్ థాపా సంఘీభావం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పరీక్ష పేపర్ లీక్, సిబిఎస్ఈ అవకతవకలకు బాధత్య వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి దేశంలోని వివిధ వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతుంది. దేశ పరీక్షా విధానంలో జరిగిన అవకతవకలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ నిరసనకు అప్పటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పౌర సమాజ సభ్యుల నుంచి మద్దతు లభించింది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేస్తున్న ఆందోళనకు కిసాన్ సంఘటనలు, మాజీ ఆర్మీ ఆఫీసర్లు, ప్రముఖులు తమ పూర్తి సంఘీభావాన్ని తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ తరువాత ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ లో ఆత్మహత్య చేసుకున్న రియా కుమారి థాపా తండ్రి, మాజీ సైనికుడు రాజేష్ థాపా జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
తన కుమార్తె మరణానికి విద్యావ్యవస్థ వైఫల్యమే కారణమని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిం చాలని రాజేశ్ అన్నారు. షనా కుమార్తెకి జరిగినది మరే బిడ్డకూ జరగ కూడదు. ఈరోజు మా కుటుంబం అనుభవిస్తున్న వేదనను మరే తల్లి దండ్రులు అనుభవిం చకూడదు”అని ఆయన అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని రాజేష్ డిమాండ్ చేశారు. తమ కుటుంబం అనుభవిం చిన నష్టాన్ని మరే కుటుంబం కూడా భరించ కూడదనే విజ్ఞప్తితో నిరసనలో చేరారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవా లని ఆయన కోరారు. తమ కుమార్తెను విఫలం చేసిన అవినీతి వ్యవస్థకు వ్యతిరే కంగా థాపా తల్లి దండ్రులు పడుతున్న దుఃఖంలోనూ, వారు చేస్తున్న పోరాటం లోనూ తాము వారికి గట్టిగా అండగా నిలుస్తామని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. సోమవారం తన స్వస్థలమైన ఛత్రపతి సంభాజీ నగర్‌లో జరగనున్న విద్యార్థుల మార్చ్ లో తాను పాల్గొంటానని తెలిపారు.
క్షీణిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం
జంతర్ మంతర్ వద్ద చేపట్టిన సీజేపీ ఆందోళన ఆదివారం 16వ రోజు కొనసాగింది. పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఎనిమిది రోజు కొనసాగింది. ఇప్పటి వరకు సుమారు ఆరు కేజీల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. వాంగ్‌చుక్ రక్తపోటు 112/70, గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. రక్తంలో చక్కెర స్థాయి 67గా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన బరువు 60.95 కిలోలకు తగ్గిందని అన్నారు. అలాగే సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. నసాగించారు. రక్తంలో చక్కెర స్థాయి 46కు పడిపోవడంతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (జేఎన్‌యూఎస్‌యూ) సంయుక్త కార్యదర్శి దానిష్ అలీని రామ్ మనోహర్ లోహియా ఆస్ప త్రికి తరలించారు. విద్యార్థి నేతలు నేహా, మనీష్, హృషికేష్, దీపక్ కుమార్ వర్మ, ఆమీన్ నిరసన ప్రదేశంలో తమ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించారు.



