గుడుంబాను అరికట్టి, బెల్ట్ షాపులను ఎత్తివేయాలి

– యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్
నవతెలంగాణ –  మల్హర్ రావు
పల్లెల్లో గుడుంబా అరికట్టి,బెల్టుషాపులను ఎత్తివేయాలని సోమవారం మంథని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి హనుమాన్ నాయక్ కు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాట్లాడుతూ మంథని డివిజన్లో నాటుసార గుడుంబా ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు నడుస్తున్నాయన్నారు .ప్రజలు గుడుంబాకు బానిసై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యువత, మద్యానికి బానిసై తమ అమూల్యమైన  భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. గుడుంబా, మద్యం వలన జనాలు పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. వీటిని నియంత్రించడంలో ఎక్సైజ్ అధికారులు వైఫల్యం చెందారని ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులకు గుడుంబా, బెల్ట్ షాపులపై, ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని విమర్శించారు.రెవెన్యూ అధికారులు వెంటనే కలగజేసుకొని మంథని డివిజన్లో గుడుంబాను అరికట్టి బెల్ట్ షాపులను ఎత్తివేయడంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట సామాజిక కార్యకర్త కడారి సతీష్ ఉన్నారు.
Spread the love