– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ
– తక్షణమే బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్
– తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంతన్ గౌరెల్లి బాధితుల ధర్నా
– అనంతరం డిప్యూటీ తహసీల్దారనకు సీపీఐ(ఎం) నాయకుల వినతి
నవతెలంగాణ-యాచారం
మంతన్‌గౌరెల్లి వడగండ్ల బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ విమర్శించారు. బుధవారం మండల రెవెన్యూ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) నాయకులు బాధితులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ పోయిన మార్చి 16న మంతన్ గౌరెల్లి లో విపరీతమైన వడగండ్ల వాన కురిసిందని, దీంతో ఇంటి పైకప్పులు, పశువుల షెడ్లు, పూల పదాలు వడగండ్లతో రంధ్రాలు పడ్డాయని అన్నారు. కురిసిన వర్షంతో పైకప్పు పడ్డ రంద్రాల ద్వారా నీరు ఇంట్లోకి చేరి ఉన్న వస్తువులని తడిసి ముద్దయ్యాయని తెలిపారు. గ్రామంలో హుటా హుటిన బాధితులను పరామర్శించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల పర్యటనలో ఇచ్చిన హామీలు పత్రిక ప్రకటన పరిమితమయ్యాయని విమర్శించారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో బాధితులకు పరిహారం చేయలా చూడాలని కోరారు. బాధితులను ఆదుకోవడంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. అకస్మాత్తుగా వర్షాలు కురిస్తే ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో దాదాపు 460కి పైగా ఇండ్లు మొత్తం దెబ్బతిన్నాయని పూర్తి చేశారు. కురిసిన అకాల వర్షంతో పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. కురిసిన వడగండ్ల వానతో పలువురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వడగండ్ల బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు తావు నాయక్, చందు నాయక్, అలంపల్లి జంగయ్య, పార్టీ నాయకులు కర్నాటి పెద్దయ్య గౌడ్, దేవోజి, నరసింహ, వెంకటేష్, మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.