దివ్యాంగులకు చేయుత

నవ తెలంగాణ మహబూబ్‌ నగర్‌
అన్ని బాగున్న మనుషులే జీవించడానికి కష్టపడే ఈ రోజుల్లో దివ్యాంగులకు డాక్టర్‌ రెడ్డిస్‌ ఫౌండేషన్‌, సిడ్బీి చేయూత ఇచ్చేందుకు ముందుకువచ్చాయి. గురువారం జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి దగ్గర గల డీఆర్డీఏ భవనంలో రెండవ దశలు 39 మంది దివ్యాంగులకు చిన్న వ్యాపా రాలు చేసుకునేందుకు రూ.25 వేల ఆర్థిక సాయం ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా రెడ్డీస్‌ సంస్థ ప్రతినిధి బెల్లంపల్లి బీ శ్రీదేవి, సిద్ధి సంస్థ ప్రతినిధి రమేష్‌ మాట్లాడుతూ మా సంస్థల ఆధ్వర్యంలో దివ్యాంగులకు చిన్న కుటీర పరిశ్రమలు చేసుకునేందుకు తమ వంతు చేయూత అందిస్తున్నామని తెలిపారు. కిరాణం టైలరింగ్‌ మిల్క్‌ సెంటర్‌ ఫోటో స్టూడియోలు ఇలా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొని జీవించడానికి అందించే సహాయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో గుర్తించిన దివ్యాం గులను మొదటి దశలో 29 మందికి రెండో దశలో 39 మందికి ఈ ఆర్థిక సాయం అందిస్తు న్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతున్నట్లు వెల్లడి ం చారు. దివ్యాంగులందరూ ధైర్యంగా జీవించడానికి ఎంతో తోడ్పడు తుం దన్నారు.కార్యక్రమంలో ఎస్‌బీఐ నుంచి అనీల్‌, నర్మదా ,డీ అర్‌ డీ ఏ నుంచి చెన్నయ్య,జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు పాల్గొన్నారు.

Spread the love