కందనూలు : కాంట్రాక్టర్ల స్వలాభ కుట్రలతో నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖాన కార్మికులు దగా పడుతున్నారని జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్ ఆరోపించారు.తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి)నేతృత్వంలో భాగంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట పారిశుధ్య సెక్యూరిటీ పేషంట్ కేర్ సిబ్బంది కార్మికులు కనీస వేతనాలకు నోచుకోక పెట్టి చాకిరి గురవుతున్న కండ్లుండి కబోదిగ మారిన వైనం అంటూ కళ్లకు గంతలు కొట్టుకొని వినూత్న ఆందోళనకు దిగారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మారేడు శివశంకర్ ,నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రి కార్మికులు అజ్మీర, మన్నెమ్మ, గౌరమ్మ , సంతోషి,రేణుక వెంకటమ్మ, మహేశ్వరి, అలివేల బురాన్ బి,అలివేలమ్మ గిరి బాలకృష్ణ నిరంజన్, రఘు తదితరులు పాల్గొన్నారు.