ఘనంగా సైదుల్‌ రావు వర్ధంతి

నవతెలంగాణ-బయ్యారం
సీపీఎం నాయకులు వేజెళ్ళ సైదులు రావు 21 వర్ధంతిని సోమవారం మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి మండల కార్యదర్శి నంబూరి మధు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ…చిన్నతనంలోనే కమ్యునిస్ట్‌ భావాల కు ఆకర్షితుడైన సైదుల్‌ రావు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అనేక పోరాటాల్లో తన వంతు కృషి చేశాడని తెలిపారు. మండలంలో కూలి రేట్ల పెంపుకోసం బడగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు వల్లాల వెంకన్న, జలగం పెద్ద యాకయ్య, ఎస్కే యాకూబ్‌, మోహన్‌, తిరుపతిరావు, మాడూరి వెంకన్న, నన్నే సాహెబ్‌ పాల్గొన్నారు.
గార్ల: నమ్ముకున్న సిద్ధాంతం కోసం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ తుదిశ్వాస వరకూ ఎర్రజెండా ను పట్టుకుని ఉద్యమాలు నిర్వహించిన వేజేళ్ల సైదులు రావు ఆశయసాధనకొరకు కృషిి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందునూరి శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్‌ నాయకులు వేజేళ్ల సైదులు రావు 21వ వర్దంతి ని స్దానిక మంగపతిరావు భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైదులు రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం అంబటి వీరాస్వామి అధ్యక్షతన జరిగిన వర్దంతి సభలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇల్లందు డివిజన్‌లో సిపిఎం పార్టీ విస్తీరణకు అవిశ్రాంతంగా పోరాటాలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల నాయకులు శ్రీను, సర్వర్‌, మల్లయ్య, అశోక్‌, లక్ష్మణ్‌, వెంకటరెడ్డి, జి.వీరభద్రం, రాంబాబు తదితరులు ఉన్నారు.

Spread the love