ఘనంగా జాతీయ డెంగ్యూ దినోత్సవం

నవతెలంగాణ – శంకరపట్నం
జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కేశవపట్నం గ్రామంలో డాక్టర్ డి శ్యాం ప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ..అన్ని గ్రామల్లోప్రజలకు మలేరియా,డెంగ్యూ సీజనల్ వ్యాధులపై అవగాహన అవసరమని చెప్పారు. గ్రామలల్లో మురికి  నీరు నిలువ ప్రదేశాల్లో దోమలు చేరి నివసిస్తూ ప్రమాదాలకు గురి చేస్తాయని ఆయన తెలిపారు. గ్రామాలలో చెత్తాచెదారం లేకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆయుష్ సంధ్య, స్టాఫ్ నర్స్ శారద సూపర్వైజర్ అనిల్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య,ఏఎన్ఎంలు,తదితరులు పాల్గొన్నారు.

Spread the love