తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు..

– ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
నవతెలంగాణ – మల్హర్ రావు
నిరంతరంఉద్యమాలతో అనేక ఆంక్షలతో తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ రెండున ఏర్పడిందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు మండల కేంద్రంలో కాటారం డివిజన్ ఆర్టీఐ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ తో కలిసి  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్రము ఏర్పడి  2024 జూన్ రెండు కు తొమ్మిది  సంవత్సరాలు, పూర్తి చేసుకుని 10 వ సంవత్సరం అడుగు పెడుతున్న ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పాలన సాగడం లేదని పాలనలో ప్రజాస్వామిక స్వభావానికి బదులుగా గత పాలకులు కేసీఆర్ ప్రభుత్వం అరాచక పాలనలో విముక్తి పొందడానికి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ ఆకాంక్షతో ఎన్నుకోవడం జరిగిందన్నారు. సహజ వనరులు ఉన్నాయి అవి స్థానిక ప్రజలకు చేతుల్లో వెళ్లడం లేదని ఇసుక మాఫియా రాజ్యమేలుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టం సబ్ ప్లాన్ అమలు చేయాలని రాష్ట్రంలో కొత్త సంస్థలు కొత్త పరిశ్రమలు రావాలని స్థానికులకు యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో దృష్టి పెట్టి ప్రజలకు రైతాంగాన్ని కాపాడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పై ఉందన్నారు. ప్రజలు రైతాంగాన్ని  కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది మానవాభివృద్ధికి అడుగడుగునా అనారోగ్యపరంగా మరణాలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రతి సంవత్సరంలో పంట ఉత్పత్తులు పెరుగుతున్నాయి కానీ రైతుల కుటుంబాలు ఆదాయం పడిపోతున్నాయని, కవులు రైతుల సంఖ్య పెరిగిపోతున్నాయి పేదల హక్కులు కల్పించే చట్టం తీసుకురావాలని రాష్ట్రంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నాయి అవినీతి అధికారుల మీద ఏసీబీ దాడులు చేసిన అవినీతి తగ్గడం లేదని, అవినీతి అధికారులను బర్తరఫ్ చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం , ప్రజలకు అనుకూలంగా పాలన సాగించాలని ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని ఆకాంక్షించారు.
Spread the love