కేసీఆర్ స్పీచ్ లో పదును తగ్గిందా..!

– పేలని డైలాగులు – పిట్టకథలు లేకుండానే సభ..
– కేసీఆర్ మాట్లాడుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయిన ప్రజలు కేసీఆర్ మాటలు జోష్ తగ్గింది..
– పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపని కేసీఆర్ మాటల తీరు..
– సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడ  కూడా చల్మెడ గెలిపించాలని కోరలేదు..
– కారు.. సారు.. కార్యకర్తలు బేజారు..
నవతెలంగాణ – వేములవాడ : బీఆర్ఎస్ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఈమధ్య ఆయన మాట తీరు ప్రసంగంలో చెప్పగా సాగింది.. ఒకప్పటిలా ప్రసంగంలో కార్యకర్తల జోష్ నింపుతూ, పంచు డైలాగులు వేస్తూ.. పిట్టకథలు చెబుతూ.. కార్యకర్తల నవ్విస్తూ ఓటర్లను తన దిక్కు మలుచుకునేవారు.. ఈ మధ్య ఎందుకు కేసీఆర్ లో మాట తీరు, ప్రవర్తన చాలా అనే మార్పు కనిపిస్తుంది.. కెసిఆర్ స్పీచ్ వినడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆసక్తిగా వినేవారు.. కానీ ఈ మధ్య ప్రసంగంలో అలాంటి ఆసక్తికరమైన డైలాగులు ప్రతిపక్షాల నాయకులపై పంచులు విసరడం లేదు.. ఎక్కడ కూడా మోడీని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సాహసం చేయడం లేదు.   కాంగ్రెస్ అగ్ర నాయకులపై రేవంత్ రెడ్డి పై అధిష్టాన నాయకులపై విరుచుకుపడుతున్నారు తప్ప వేరే అంశాన్ని తీసుకురావడం లేదు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పుడు తెలంగాణ సెంటిమెంటుతో రెండు ఎన్నికల్లో ఉదృతంగా తీసుకువెళ్లి ఓటర్లను తన మాటల గారడితో ప్రసన్నం చేసుకున్నారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు బిఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత ఎందుకో వెనుక పడ్డారు. ప్రజల్లో సైతం పథకాలన్నీ అధికార పార్టీ నేతలకే అందుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి.. వాటిపై మాట్లాడడం లేదు.. గతంలో తను కూర్చిని వేసుకొని కూర్చుండి పని చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడలేదని ప్రజలు అనుకుంటున్నారు.. ఎక్కడ కూడా ఉద్యోగుల భర్తీ ,రైతుల రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు, మొత్తంగా పదునులేని కెసిఆర్ స్పీచ్ ఈసారి బిఆర్ఎస్ కు  పెద్ద మైనస్ అని సొంత పార్టీ నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓటమి భయం పట్టుకుందో ఓడిపోతే పోయేదేమీ లేదు ఇంట్లో కూర్చుంటా అని చెబుతున్నారు.. మరోవైపుతాను ఓడిస్తే నష్టపోయేది ప్రజలే అని అంటున్నారు. కెసిఆర్ లో ఓటమి భయం మొదలైందా..? మాట మారిందా..? కెసిఆర్ రాజకీయ చతురత ముందు ప్రతిపక్ష నాయకుల కుప్పగింతలు సాగవని గతంలో మాట్లాడిన వారే తాజాగా సీఎం కేసీఆర్ ప్రసంగం విస్తు పోతున్నారు. ఒక ఉద్యమ నాయకుడు ప్రసంగం ఇలా సప్పగా సాగడం జనాల్లో రుచించడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే కుక్కలు చించిన విస్తారవుతుందంటూ పరీక్షంగా కాంగ్రెస్ బలాన్ని చెప్పకనే చెప్పుకుంటూ వస్తున్నారు. రాజకీయంలో చాణిక్యుల ఎత్తుగడ వేసే కెసిఆర్ ఎందుకు వెనుక పడ్డారు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్కడ  కూడా చల్మెడ గెలిపించాలని కోరలేదు..
2009 నుండి నేడు జరుగుతున్న ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ జండా ఎగరేసిన చిన్నమనేని రమేష్ బాబు కు పౌరసత్వ వివాదంతో బిఆర్ఎస్ అధిష్టానం ఈసారి టికెట్ నిరాకరించింది. చిల్మెడ లక్ష్మీనరసింహారావు కేటీఆర్ ప్రోత్బలంతో వేములవాడ టికెట్ కేటాయించడం తో జీవించుకోలేని రమేష్ బాబు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా చెలిమెడ లక్ష్మీనరసింహారావు గెలిపించాలని కోరలేదు సీఎం కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు తప్ప చెలిమడానికి గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఓటర్లను అభ్యర్థించడం లేదు దీనికి సైతం ఆయన కు నమ్మకంగా ఉండే కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సెట్టింగ్ ఎమ్మెల్యే చిన్నాన అయినా విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ కు బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని దశాబ్ద కాలంగా చిన్నమనేని కుటుంబానికి సిరిసిల్ల, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచిన కంచుకోట అలాంటి కంచుకోటలో వేరే వ్యక్తి వచ్చి కూర్చుంటా అంటే ఎట్లా సపోర్ట్ చేస్తారని ఇటు బిఆర్ఎస్ నాయకుల్లో, కార్యకర్తల్లో వేములవాడ ప్రజల్లో మాట్లాడుకుంటున్న చర్చ అంశం ఇది..
కేసీఆర్ మాట్లాడుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయిన ప్రజలు కేసీఆర్ మాటలు జోష్ తగ్గింది..
ఎన్నికల ప్రచారంలో చివరి దశకు వచ్చిన ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన ఆశీర్వాద సభకు రెండున్నర గంటలకు రావలసిన సీఎం కేసీఆర్ గంటన్నర ఆలస్యం అవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే ప్రసంగమధ్యంలో నుండే ప్రజలు, కార్యకర్తలు తిరుగు ప్రయాణమయ్యారు. వేలాదిగా తిరిగి వచ్చిన ప్రజలు సరైన వసతులు ఏర్పాటు చేయక ఎండలోని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కెసిఆర్ చూడాలని కెసిఆర్ మాట్లాడుతుంటే వినాలని ఎంతగా ఆశగా వచ్చిన అభిమానులు కార్యకర్తలు ఎంతో నిరాశకు గురయ్యారు.
Spread the love