Wednesday, July 8, 2026
E-PAPER
Homeఆటలుహెచ్‌‌సీఏ అవినీతిమయం

హెచ్‌‌సీఏ అవినీతిమయం

- Advertisement -

టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌ ‌క్రికెట్‌ ‌సంఘం (హెచ్‌సీఏ) అవినీతిమయంగా మారిందని తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (‌టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి ఆరోపించారు. ఒకే క్లబ్‌‌కు రెండు రిజిస్ర్టేషన్లు, అపెక్స్‌ ‌కౌన్సిల్‌‌లో ఇద్దరు సభ్యులు ఓ కుటుంబానికి చెందిన క్లబ్‌‌లకు ప్రాతినిథ్యం వహించటం, తాత్కాలిక సీఈవో సైతం గతంలో ఆ కుటుంబ క్లబ్‌‌లో ఆఫీస్‌‌బేరర్‌‌గా ఉండటంతో విరుద్ద ప్రయోజనాలు పొందుతున్నారని గురువారెడ్డి విమర్శించారు. బీసీసీఐ నిబంధనలు, జస్టిస్‌ ‌లోధా సిఫారసుల ప్రకారం ఆఫీస్‌‌బేరర్లు దల్జీత్‌ ‌సింగ్‌, బసవరాజు సహా సీఈవో ఇంతియాజ్‌ ‌ఖాన్‌‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాల ప్రకారం పదవుల్లో కొనసాగేందుకు అనర్హులని గురువారెడ్డి అన్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం రాజకీయ నాయకులకు క్రికెట్‌ ‌సంఘాల్లో ప్రవేశించేందుకు అనుమతి లేదని, కానీ హెచ్‌‌సీఏలో ఆ రూల్స్‌‌ను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. బీసీసీఐ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండానే టీజీ20 లీగ్‌ ‌నిర్వహిస్తున్నారని గురువారెడ్డి అన్నారు. లీగ్‌‌లో గ్రామీణ, జిల్లా క్రికెటర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా, హైదరాబాద్‌ ఆటగాళ్లకే అవకాశాలు కల్పించారని తెలిపారు. తెలంగాణ గ్రామీణ క్రికెట్‌ అభివృద్దికి కృషి చేస్తున్న టీసీఏకు త్వరలోనే బీసీసీఐ గుర్తింపు దక్కతుందని, తెలంగాణ క్రికెట్‌ ‌బాధ్యతమే తామే తీసుకుంటామని గురువారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -