Wednesday, July 8, 2026
E-PAPER
Homeఆటలుప్లే ఆఫ్స్‌‌కు కరీంనగర్‌

ప్లే ఆఫ్స్‌‌కు కరీంనగర్‌

- Advertisement -

తన్మయ్‌ అగర్వాల్‌ సెంచరీ టీజీ20 లీగ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
తన్మయ్‌ అగర్వాల్‌ (109, 58 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌‌లు) సెంచరీతో చెలరేటంతో కరీంనగర్‌ ‌డైమండ్స్‌ ‌టీజీ20 లీగ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన లీగ్‌ ‌దశ ఆఖరు మ్యాచ్‌‌లో పాలమూరు స్ర్టయికర్స్‌‌పై కరీంనగర్‌ ‌డైమండ్స్‌ 73 ‌పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తన్మయ్‌ అగర్వాల్‌ ‌సెంచరీకి తోడు సాత్విక్‌ ‌రెడ్డి (32), నారాయణ తేజ (23 నాటౌట్‌) ‌రాణించటంతో కరీంనగర్‌ ‌డైమండ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. ఛేదనలో పాలమూరు స్ర్టయికర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులే చేసింది. సంహిత్‌ ‌రెడ్డి (67 నాటౌట్‌, 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లు) అజేయ అర్థ సెంచరీతో పాలమూరు స్ర్టయికర్స్‌‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. కరీంనగర్‌ ‌బౌలర్లలో దినేశ్‌ (3/27), శుభమ్‌ ‌శర్మ (3/16) మూడు వికెట్లతో రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -