మందలించాడని టీచర్‌ ను కత్తితో పొడిచాడు

దిస్పూర్‌: తక్కువ మార్కులు వచ్చాయని మందలించిన ఉపాధ్యాయుడిని ఓ విద్యార్ధి కత్తితో పొడిచి హత్య చేశాడు. అసోంలోని శివసాగర్‌ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్లస్‌ వన్‌(ఇంటర్‌ మొదటి సంవత్సరం) చదువుతున్న విద్యార్థి తరగతి గదిలో కెమిస్ట్రీ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు రాజేష్‌ బారుహ్‌ బెజవాడ (55)ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని ఆస్పత్రికి తరలించగా మతి చెందాడు. విద్యార్ధి హత్యను వినియోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Spread the love